Vijay Kumar: రేవంత్ రెడ్డి కుట్రలను ఎండగడుతాం
ABN , First Publish Date - 2023-10-30T20:30:57+05:30 IST
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) కాంగ్రెస్ పార్టీపై కుట్రలు చేస్తున్నారని బహిష్కృత టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కురువ విజయ్ కుమార్ ( Vijay Kumar ) ఆరోపించారు.
హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) కాంగ్రెస్ పార్టీపై కుట్రలు చేస్తున్నారని బహిష్కృత టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కురువ విజయ్ కుమార్ ( Vijay Kumar ) ఆరోపించారు. సోమవారం నాడు‘‘రేవంత్ రెడ్డి హటావో కాంగ్రెస్ బచావో అనే వాల్ పోస్టర్ ను ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ప్రకటించిన 100 సీట్లలో దాదాపు 45సీట్లకు పైగా ప్యారాచూట్ లకు టికెట్లు రేవంత్ రెడ్డి అమ్ముకున్నాడు. స్పష్టమైన ఆధారాలతో మేము పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాం, వివిధ పద్ధతులల్లో నిరసన తెలియజేశాం. ఇందుకుగానూ మమ్మల్ని పార్టీ నుంచి ఎలాంటి సంజాయిషీ లేకుండా సస్పెండ్ చేశారు. రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకొని... నిజమైన కార్యకర్తలకు అన్యాయం చేశాడు. రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేయడానికి రేవంత్ రెడ్డి హఠావో కాంగ్రెస్ బచావో అనే వాల్ పోస్టర్ ను విడుదల చేస్తున్నాము. వ్యాపార వేత్తలకు కోట్ల రూపాయలు డబ్బులు తీసుకోని టికెట్లను రేవంత్ రెడ్డి అమ్ముకున్నాడు. కాంగ్రెస్ ప్రకటించిన రెండు లిస్ట్ లలో నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరిగింది. 65 కాంగ్రెస్ సీట్లను 600 కోట్ల రూపాయలకు అమ్ముకున్నాడు. అన్ని గ్రామాల్లో పర్యటిస్తాము. రేవంత్ రెడ్డి హటావో కాంగ్రెస్ బచావో అనే నినాదం తో ముందుకు వెళ్తాము’’ అని విజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.