Thummala Nageswara Rao : వయ్యారి భామ రాజకీయాలు మీరే గమనించాలి
ABN , First Publish Date - 2023-11-06T11:04:01+05:30 IST
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు నేడు 46... 47... 48 డివిజన్లలో రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. మున్నేరు వరదల విషయంలో ఎన్నికల ముందు శంకుస్థాపనలు నమ్ముతారా? అని ప్రశ్నించారు. వ
ఖమ్మం : ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు నేడు 46... 47... 48 డివిజన్లలో రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. మున్నేరు వరదల విషయంలో ఎన్నికల ముందు శంకుస్థాపనలు నమ్ముతారా? అని ప్రశ్నించారు. వయ్యారి భామ రాజకీయాలు మీరే గమనించాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మున్నేరు వరదలకు అడ్డుకట్టగా కరకట్ట నిర్మాణం చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలు మహిళల వికాసం ప్రగతి కోసం సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ పెద్ద పీట వేశారని తుమ్మల అన్నారు.