Share News

TS Polls: కామారెడ్డిలో ఉద్రిక్తత.. టీపీసీసీ చీఫ్ రేవంత్ సోదరుడు కొండల్‌రెడ్డిపై...

ABN , First Publish Date - 2023-11-30T12:09:16+05:30 IST

కామారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కామారెడ్డి బరిలో ఉన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డిని బీఆర్‌ఎస్ నేతలు అడ్డుకుంటున్నారు. కొండల్‌రెడ్డి స్థానికేతరుడు అని గులాబీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కొండల్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉదయం నుంచి బీఆర్‌ఎస్ నేతలు తనను వెంబడించి దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

TS Polls: కామారెడ్డిలో ఉద్రిక్తత.. టీపీసీసీ చీఫ్ రేవంత్ సోదరుడు కొండల్‌రెడ్డిపై...

కామారెడ్డి: కామారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కామారెడ్డి బరిలో ఉన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth reddy) సోదరుడు కొండల్‌రెడ్డిని (Kondal Reddy) బీఆర్‌ఎస్ నేతలు అడ్డుకుంటున్నారు. కొండల్‌రెడ్డి స్థానికేతరుడు అని గులాబీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కొండల్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉదయం నుంచి బీఆర్‌ఎస్ నేతలు తనను వెంబడించి దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సజావుగా ఎన్నికలు జరుగకుండా చూస్తున్నారని అన్నారు. పోలీసులు కూడా బీఆర్‌ఎస్ నేతలకు సహకరిస్తున్నారని కొండల్ రెడ్డి ఆరోపించారు.

మరోవైపు కామారెడ్డిలో బయటి వ్యక్తులు తిరుగుతున్నారని, ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. నాన్‌లోకల్ కాంగ్రెస్ నాయకులు వస్తున్నారంటూ బీఆర్‌ఎస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. పోలింగ్ కేంద్రం వద్ద రోడ్డుపై బైఠాయించి బీఆర్‌ఎస్ శ్రేణులు ధర్నాకు దిగాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్‌, కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. సున్నితమైన నియోజకవర్గం కావడంతో ఇక్కడ ప్రతీ అంశం కూడా వివాదస్పదంగా మారుతోంది.


అయితే మరోవైపు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి కామారెడ్డిలో రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి తిరుగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల రోజు స్థానికేతరులు ఉండాకూడదు అన్న నిబంధన ఉల్లంఘించి మూడు కార్ల కాన్వాయ్‌లో కొండల్‌రెడ్డి కామారెడ్డిలో తిరుగుతున్నారని.. ఇండిపెండెంట్ అభ్యర్ధికి పోలింగ్ ఏజెంట్‌గా తప్పుడు పత్రాలు సృష్టించి కామారెడ్డిలోనే ఉన్నారని... గమనించి స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు... నాన్ లోకల్ మనిషివి ఇక్కడ ఎలా ఉన్నావని కొండల్‌రెడ్డితో వాగ్వావాదానికి దిగినట్లు తెలుస్తోంది.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - 2023-11-30T12:17:35+05:30 IST