Telangana Elections: తెలంగాణ ఎన్నికలకు కొన్నిరోజులే.. బ్యాలెట్, పోస్టల్ బ్యాలెట్ ముద్రణ షురూ
ABN , First Publish Date - 2023-11-20T11:39:29+05:30 IST
Telangana Elections: తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈనెల 30 తెలంగాణ ఎన్నికలు, డిసెంబర్ 3 ఫలితాలు వెల్లడికానున్నాయి.

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికలకు (Telangana Elections) సమయం దగ్గరపడుతోంది. ఈనెల 30న తెలంగాణ ఎన్నికలు, డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ నేపథ్యంలో పోలింగ్ - కౌంటింగ్‌కు ఎలక్షన్ కమిషన్ (Election Commission) సిద్ధమవుతోంది. 14 లక్షల 40వేల బ్యాలెట్ పేపర్, 25 వేల పోస్టల్ బ్యాలెట్ ముద్రణ ప్రారంభమైంది. 26 వరకు హోం ఓటింగ్, ఫెసిలిటేషన్ సెంట్రల్ ముగించాలని ప్రణాళికలు రూపొందించారు. కొత్త ఓటర్లు పెరగడంతో అదనంగా 299 పోలింగ్ కేంద్రాలు పెరిగాయి. ఈసారి జరిగే కౌంటింగ్ కేంద్రాలను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పెంచింది. రాష్ట్ర వ్యాప్తంగా 35 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేస్తోంది. లా అండ్ ఆర్డర్ విషయంలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పకడ్భందీ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రానికి 375 కేంద్ర కంపెనీల నుంచి 40 వేల వరకు సెంట్రల్ ఫోర్సెస్ రానున్నాయి. ఆయా రాజకీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. ఎమ్‌సీసీ వాయిలేషన్ కాకుండా స్పెషల్ అబ్జర్వర్ల నియామకం జరిగింది. సీఈసీ నిబంధనలు అతిక్రమిస్తే ఎవ్వరైనా ఉపేక్షించేది లేదని ఈసీఐ హెచ్చరించింది.
సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
సమస్యాత్మక ప్రాంతాలపై ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక దృష్టి పెట్టింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 35 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9వేలకు పైగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఎలక్షన్ కమిషన్ గుర్తించింది. గ్రేటర్ హదరాబాద్‌లో 18 వందల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో మూడంచెల భద్రత, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఐదు అంచెల భద్రత కల్పించనున్నారు. 5వందలకు పైగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ స్టేషన్లు ఉండటంతో.. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద సెంట్రల్ ఫోర్సెస్‌తో పహారా నిర్వహించనున్నారు.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి