Share News

TS POLLS : తెలంగాణలో రేపు ఉదయం 7గంటల నుంచి పోలింగ్ ప్రారంభం

ABN , First Publish Date - 2023-11-29T14:40:50+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రేపు ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతుందని సీఈఓ వికాస్‌రాజ్ ( CEO Vikasraj ) తెలిపారు. బుధవారం నాడు సీఈఓ కార్యాలయంలో ఏబీఎన్‌తో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలల్లో నాలుగు వేలకు పైగా అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయని చెప్పారు. అక్కడ అదనపు బలగాలతో పాటు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వికాస్‌రాజ్ తెలిపారు .

TS POLLS : తెలంగాణలో రేపు ఉదయం 7గంటల నుంచి పోలింగ్ ప్రారంభం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రేపు ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతుందని సీఈఓ వికాస్‌రాజ్ ( CEO Vikasraj ) తెలిపారు. బుధవారం నాడు సీఈఓ కార్యాలయంలో ఏబీఎన్‌తో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలల్లో నాలుగు వేలకు పైగా అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయని చెప్పారు. అక్కడ అదనపు బలగాలతో పాటు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. రిగ్గింగ్ జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలకు సంబంధించి మాకు కొన్ని ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. వెబ్ కాస్టింగ్ సిస్టం ద్వారా ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులు మానిటరింగ్ చేస్తామన్నారు. ఈసారి ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని అన్నారు. 375 కేంద్ర బృందాలు , 45 వేలకు పైగా పొలీసు సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉంటారని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్‌లో ఉన్న ఇబ్బందులపై ప్రత్యామ్నాయం చూపించామని అన్నారు. ఏజెన్సీ ఏరియాల్లో భద్రతా మరింత కట్టుదిట్టం చేశామని సీఈఓ వికాస్‌రాజ్ పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2023-11-29T14:44:44+05:30 IST