Share News

Naveen Yadav: కాంగ్రెస్ గూటికి జూబ్లీహిల్స్ స్వతంత్ర అభ్యర్థి నవీన్ యాదవ్

ABN , First Publish Date - 2023-11-15T15:56:05+05:30 IST

జూబ్లీహిల్స్ స్వతంత్ర అభ్యర్థి నవీన్ యాదవ్ ( Naveen Yadav ) కాంగ్రెస్ ( Congress ) పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ అభ్యర్థి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజరుద్దీన్‌ ( Azharuddin ) తో నవీన్ యాదవ్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

 Naveen Yadav: కాంగ్రెస్ గూటికి జూబ్లీహిల్స్ స్వతంత్ర అభ్యర్థి నవీన్ యాదవ్

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ స్వతంత్ర అభ్యర్థి నవీన్ యాదవ్ (
Naveen Yadav ) కాంగ్రెస్ ( Congress ) పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ అభ్యర్థి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజరుద్దీన్‌ ( Azharuddin ) తో నవీన్ యాదవ్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని అజరుద్దీన్‌ కోరడంతో ఈ మేరకు నవీన్ యాదవ్ సానుకూలంగా స్పందించారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. అలాగే నవీన్ యాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా వేసిన నామినేషన్ విత్ డ్రా చేసుకున్నాడు. సాయంత్రం 6 గంటలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. నవీన్ యాదవ్ చేరికతో జూబ్లీహిల్స్ కాంగ్రెస్‌ పార్టీ క్యాడర్ ఫుల్ జోష్‌లో ఉంది. నవీన్ యాదవ్ కాంగ్రెస్ చేరితే జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్ బలం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీహిల్స్‌లో గెలుపు కష్టమేనని రాజకీయ వ్యక్తలు అభిప్రాయం చేస్తున్నారు.

Updated Date - 2023-11-15T15:56:07+05:30 IST