Telangana Elections: రేపటి (నవంబర్ 30) సెలవుపై ఈసీకి ఫిర్యాదుల వెల్లువ
ABN , First Publish Date - 2023-11-29T12:31:41+05:30 IST
Telangana Elections: తెలంగాణ వ్యాప్తంగా రేపు(నవంబర్ 30) ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు, ప్రైవేటు సంస్థలకు ఇప్పటికే సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈసీ సెలవు ప్రకటించినప్పటికీ పలు సంస్థలు, కళాశాలలు పట్టించుకోని పరిస్థితి.
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా రేపు(నవంబర్ 30) ఎన్నికలు (Telangana Elections) జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు, ప్రైవేటు సంస్థలకు ఇప్పటికే సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈసీ సెలవు ప్రకటించినప్పటికీ పలు సంస్థలు, కళాశాలలు పట్టించుకోని పరిస్థితి. ఈ క్రమంలో రేపు సెలవు ఇవ్వడం లేదని ఎలక్షన్ కమిషన్‌కు అనేక ఫిర్యాదులు వచ్చి చేరాయి. దాదాపు 1950కు పైగా పలు ప్రైవేట్ సంస్థలు, కళాశాలల నుంచి వరుస ఫిర్యాదులు వచ్చాయి. స్థానిక అధికారులకు చెప్పినా ఫలితం లేకపోవడంతో స్టేట్ ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. ప్రభుత్వ, ప్రైవేట్ సెలవు ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దీంతో తమ ఆదేశాలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరికలు జారీ చేసింది.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి