CM KCR: కాంగ్రెస్ పార్టీ వస్తే పెద్ద ప్రమాదం.. ఓటు జాగ్రత్తగా వేయాలి
ABN , First Publish Date - 2023-11-15T18:22:26+05:30 IST
మెదక్ సీఎస్ఐ చర్చి గ్రౌండ్‌లోని ప్రజా ఆశీర్వాద సభ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ వస్తే పెద్ద ప్రమాదం వస్తుందని మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్టు నాయకులు వాగ్దానాలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మెదక్ జిల్లా: మెదక్ సీఎస్ఐ చర్చి గ్రౌండ్‌లోని ప్రజా ఆశీర్వాద సభ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ వస్తే పెద్ద ప్రమాదం వస్తుందని మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్టు నాయకులు వాగ్దానాలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకుల చరిత్ర, పార్టీల వైఖరి కూడా చూడాలని ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు.
"ఎన్నికలు వచ్చాయంటే ఆగమాగం. ఇష్టం వచ్చినట్టు నాయకులు వాగ్దానాలు ఇస్తున్నారు. ఎన్నికలు వస్తే పార్టీకో మనిషి నిలబడుతారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో పరిణితి లేదు. నాయకుల చరిత్ర, పార్టీల వైఖరి కూడా మీరు చూడాలి. ప్రజల చేతిలో ఉండే పెద్ద ఆయుధం మీ ఓటు. మంచివాళ్ళకి ఓటు వేస్తే మంచి జరుగుతుంది. ఎవరో ఒకరు ఎమ్మెల్యే అవుతారు. వేసే ఓటు జాగ్రత్తగా ఆలోచించి వేయాలి. లేకపోతే అదే మనకు కాటు వేస్తుంది. BRS పార్టీ తెలంగాణ సాధన కోసం పుట్టిన పార్టీ. కాంగ్రెస్ పార్టీకి 50 ఏళ్ల చరిత్ర ఉంది. BRS వచ్చినప్పుడు తెలంగాణలో తాగు, సాగు నీళ్లు లేవు, రైతుల ఆత్మహత్యలు. కానీ ఈ పదేళ్లలో BRS పార్టీ ఏం చేసిందో మీరు గమనించాలి. సంక్షేమంలో తెలంగాణ దేశంలో నెంబర్ వన్. కాంగ్రెస్ పార్టీ వస్తే పెద్ద ప్రమాదం వస్తుంది. రైతు బంధు ఇచ్చి డబ్బులు దుబారా చేస్తున్నారు అని కాంగ్రెస్ వాళ్లు చెబుతున్నారు." అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
" రైతు బంధు 16 వేలకు పెంచుతున్నాం. రైతులకు 24 గంటల కరెంట్ వెస్ట్ అని పీసీసీ అధ్యక్షుడు చెబుతున్నారు. 3 గంటలు చాలని అంటున్నారు. 10 HP మోటార్ పెట్టుకోవాలని సలహా ఇస్తున్నారు. కాంగ్రెస్ వస్తే ధరణి తీసేస్తామని కాంగ్రెస్ అగ్రనేతలు చెబుతున్నారు. ధరణి తీసేస్తే రైతు బంధు, రైతు భీమా బంద్ అవుతాయి. కాంగ్రెస్ పార్టీ మీ ఓటుతోనే మీ కన్ను పొడిపియ్యాలని చూస్తుంది. ధరణి తీసేస్తే దళారుల రాజ్యం, పైరవి కారుల రాజ్యం మళ్ళీ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అనాలోచితంగా మాట్లాడుతుంది. కర్ణాటక డిప్యూటీ సీఎం నాకు సవాల్ విసిరాడు 5 గంటల కరెంట్ ఇస్తున్నామని. ఒరేయ్ సన్నాసి మేము 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. సినిమా మ్యాట్నీ షో కాదు ఓటంటే..జాగ్రత్తగా వేయాలి. మంజీరా నది వస్తుంటే చూశాను నిండుగా ఉంది. కాంగ్రెస్ హయాంలో ఎండిపోయి ఉండేది. ఉన్న తెలంగాణని ఊడగొట్టి 50 ఏళ్ళు మనల్ని గోస పెట్టిన కాంగ్రెస్ పార్టీ కొత్త రూపంలో వస్తుంది. జాగ్రత్త మోసపోతే గోసపడుతాం. ఎవడో వచ్చి ఎదో చెబితే కాదు. తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉంది. పద్మా దేవేందర్ రెడ్డిపై పోటీకి దిగిన వ్యక్తికి పోలిక ఉందా. ఎవరో వచ్చి దిష్టి బొమ్మని పెడితే ఎట్లా. హెలికాప్టర్ తో గోస ఉంది..ఇంకో 5 నిమిషాలు అయితే ఇక ఎగురది." అని కేసీఆర్ అన్నారు.