Share News

Telangana Elections: హైదరాబాద్‌లో సినీ సెలబ్రిటీలు ఎవరెక్కడ ఓటేయనున్నారంటే...

ABN , First Publish Date - 2023-11-29T14:30:41+05:30 IST

తెలంగాణ వ్యాప్తంగా గురువారం (నవంబర్ 30) జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు (Telangana Elections) సర్వం సిద్ధమైంది. ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.

Telangana Elections: హైదరాబాద్‌లో  సినీ సెలబ్రిటీలు ఎవరెక్కడ ఓటేయనున్నారంటే...

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా గురువారం (నవంబర్ 30) జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు (Telangana Elections) సర్వం సిద్ధమైంది. ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. మరోవైపు హైదరాబాద్‌లో పలువురు సినిమా సెలబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సినీ సెలబ్రిటీలు ఎవరెవరు.. ఎక్కడెక్కడ ఓటు వేయనున్నారో చూద్దాం.


ఓటువేసే సినీ ప్రముఖుల వివరాలు ఇవే...

  • జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ (పోలింగ్‌ బూత్‌ 164): విజయ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ,శ్రీకాంత్‌

  • ఎఫ్‌ఎన్‌సీసీ (పోలింగ్‌ బూత్‌ 164): రాఘవేంద్రరావు, జీవిత, రాజశేఖర్‌

  • ఎఫ్‌ఎన్‌సీసీ(పోలింగ్‌ బూత్‌ 160): విశ్వక్‌సేన్‌

  • పోలింగ్‌ బూత్‌ 166: దగ్గుబాటి రాణా, సురేశ్‌ బాబు

  • జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ (పోలింగ్‌ బూత్‌ 165): మహేశ్‌బాబు, నమ్రత, మంచు మోహన్‌బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్‌

  • జూబ్లీహిల్స్‌ క్లబ్‌ (పోలింగ్‌ బూత్‌ 149): చిరంజీవి, సురేఖ, రాంచరణ్, ఉపాసన , నితిన్‌

  • ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ(పోలింగ్‌ బూత్‌ 157): రవితేజ

  • ఓబుల్‌రెడ్డి స్కూల్‌(పోలింగ్‌ బూత్‌ 150): జూనియర్‌ ఎన్టీఆర్‌, ప్రణతి

  • బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌ (పోలింగ్‌ బూత్‌ 153): అల్లు అర్జున్, స్నేహారెడ్డి ,అల్లు అరవింద్, అల్లు శిరీష్‌

  • వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌(పోలింగ్‌ బూత్‌ 151): నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్‌

  • మణికొండ: ప్రభాస్, అనుష్క, వెంకటేశ్, బ్రహ్మానందం

  • రోడ్‌ నెం.45, జూబ్లీహిల్స్‌ – ఆర్థిక సహకార సంస్థ: అల్లరి నరేశ్‌

  • యూసఫ్‌గూడ చెక్‌పోస్టు ప్రభుత్వ పాఠశాల: తనికెళ్ల భరణి

Updated Date - 2023-11-29T18:17:15+05:30 IST