Share News

BJP: వేములవాడ అభ్యర్థి మార్పుపై తుల ఉమ కంటతడి

ABN , First Publish Date - 2023-11-10T18:44:36+05:30 IST

వేములవాడ బీజేపీ టికెట్ దక్కకపోవడంతో తుల ఉమ కన్నీళ్లు పెట్టుకున్నారు. చివరి నిమిషంలో బీజేపీ అగ్రనాయత్వం అభ్యర్థిని మార్చడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ మహిళలకు పార్టీలో గౌరవం లేదని, వేములవాడలో కచ్చితంగా పోటీ చేస్తానని తుల ఉమ స్పష్టం చేశారు.

BJP: వేములవాడ అభ్యర్థి మార్పుపై తుల ఉమ కంటతడి

హైదరాబాద్: వేములవాడ బీజేపీ టికెట్ దక్కకపోవడంతో తుల ఉమ కన్నీళ్లు పెట్టుకున్నారు. చివరి నిమిషంలో బీజేపీ అగ్రనాయత్వం అభ్యర్థిని మార్చడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ మహిళలకు పార్టీలో గౌరవం లేదని, వేములవాడలో కచ్చితంగా పోటీ చేస్తానని తుల ఉమ స్పష్టం చేశారు. అభ్యర్థిని మార్చినట్లు కనీసం సమాచారం ఇవ్వలేదని తెలిపారు. మొదట వేములవాడ బీజేపీ అభ్యర్థిగా తుల ఉమ ఉన్నారు. చివరి నిమిషంలో మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు కుమారుడికి వేములవాడ బీజేపీ టికెట్ ఇవ్వడంపై తుల ఉమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బీజేపీలో మహిళా నేతల కన్నీరు పెట్టుకుంటున్నారు. టికెట్ దక్కకపోవడంతో పలుచోట్ల రెబల్‌ అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. 13న నామినేషన్ల పరిశీలన, 15 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. ఈ రోజు నామినేషన్ల స్వీకరణకు చివరిరోజు కావడంతో భారీ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

Updated Date - 2023-11-10T18:57:31+05:30 IST