Share News

Election Results: షాకింగ్.. ఎదురీదుతున్న బీజేపీ కీలక నేతలు..

ABN , First Publish Date - 2023-12-03T11:01:41+05:30 IST

తెలంగాణ ఎన్నికల ఫలితాలు చిత్ర విచిత్రమైన ఫలితాలను అందిస్తున్నాయి. కామారెడ్డిలో కేసీఆర్ వెనుకబడటమే షాక్‌ను కలిగిస్తుంటే.. మరోవైపు బీజేపీ కీలక నేతలంతా వెనుకబడిపోతుడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బీజేపీ కీలక నేతలైన బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందనరావు వెనుకబడిపోయారు.

Election Results: షాకింగ్.. ఎదురీదుతున్న బీజేపీ కీలక నేతలు..

హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల ఫలితాలు చిత్ర విచిత్రమైన ఫలితాలను అందిస్తున్నాయి. కామారెడ్డిలో కేసీఆర్ వెనుకబడటమే షాక్‌ను కలిగిస్తుంటే.. మరోవైపు బీజేపీ కీలక నేతలంతా వెనుకబడిపోతుడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బీజేపీ కీలక నేతలైన బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందనరావు, రాజాసింగ్ వెనుకబడిపోయారు. పది స్థానాల్లో మాత్రం బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. కార్వాన్, సిర్పూర్ కాగజ్‌నగర్‌, గోషామహాల్, నిర్మల్, ముథోల్, బోథ్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, మహేశ్వరంలో బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది.

Updated Date - 2023-12-03T11:04:44+05:30 IST