TS NEWS: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య‌ను ఓడిస్తా: శేజల్

ABN , First Publish Date - 2023-08-22T01:07:08+05:30 IST

బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య(BRS MLA Durgam Chinnaiah)కు మరోసారి సీఎం కేసీఆర్(CM KCR) టికెట్ ఇవ్వడంపై బాధితురాలు శేజల్(Sejal) ఆందోళన వ్యక్తం చేశారు.

TS NEWS: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య‌ను ఓడిస్తా: శేజల్

బెల్లంపల్లి: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య(BRS MLA Durgam Chinnaiah)కు మరోసారి సీఎం కేసీఆర్(CM KCR) టికెట్ ఇవ్వడంపై బాధితురాలు శేజల్(Sejal) ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘7 నెలలుగా దుర్గం చిన్నయ్యపై పోరాటం చేస్తున్నా. దుర్గం చిన్నయ్య ఒక కామపిశాచి. ఎన్నో భూకబ్జాలు చేశాడు. ఏడు నెలలుగా చేసిన న్యాయపోరాటంపై ఈరోజు విశ్వాసం పోయింది. చిన్నయ్యకు మరోసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాగే అమ్మాయిలను వేధింపులకు గురిచేయమని దుర్గం చిన్నయ్యకు టికెట్ ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఉంది. దుర్గం చిన్నయ్య చేసిన తప్పులపై న్యాయ పోరాటం చేస్తా. బెల్లంపల్లిలో ఎలా గెలుస్తావో చూస్తా.దుర్గం చిన్నయ్య చేసిన లైంగిక వేధింపులు, అక్రమాలు భూకబ్జాలపై బెల్లంపల్లిలో గడపగడపకు వెళ్లి ప్రచారం చేస్తా’’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై బాధితురాలు శేజల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-08-22T01:07:12+05:30 IST