Bhatti Vikramarka: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లక్షల కోట్ల అప్పుల పాలైంది..

ABN , First Publish Date - 2023-03-19T15:41:55+05:30 IST

ఆదిలాబాద్ జిల్లా: సీఎల్పీ నేత (CLP Leader) భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) చేపట్టిన పాదయాత్ర (Padayatra) ఆదివారం ఇంద్ర వెల్లి మండలం, కుమ్మరి తండాకు చేరుకుంది.

Bhatti Vikramarka: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లక్షల కోట్ల అప్పుల పాలైంది..

ఆదిలాబాద్ జిల్లా: సీఎల్పీ నేత (CLP Leader) భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) చేపట్టిన పాదయాత్ర (Padayatra) ఆదివారం ఇంద్ర వెల్లి మండలం, కుమ్మరి తండాకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ (Telangana) లక్షల కోట్ల అప్పుల్లో ఉందని, రాష్ట్రం కేసీఆర్ (KCR) పాలైందన్నారు. కాంగ్రెస్‌ (Congress)ను అధికారంలోకి తేవడానికే తమ పాదయాత్ర అని స్పష్టం చేశారు.

టీఎస్‌పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజీ (Paper Leakage)కు బాధ్యులైన వారు పదవులకు రాజీనామా చేయాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ధరణి (Dharani) వల్ల ఎక్కువగా పేద రైతులే నష్ట పోయారన్నారు. ఒకప్పుడు భూములను వదిలేసి వెళ్ళిన వారందరికీ లబ్ది చేకూరిందన్నారు. సీఎం కేసీఆర్ తీరు, ధరణి వెబ్ సైట్ వల్ల రాష్ట్రంలో తిరిగి ఫ్యూడలిజం (Feudalism) వచ్చిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ధరణిలో మార్పులు చేస్తామని స్పష్టం చేశారు. కాస్తు సహా ఇతర కాలమ్స్‌ను పొందు పరుస్తామన్నారు. పార్టీలో నేతల మధ్య విభేదాలు లేవని, భిన్నాభి ప్రాయాలు మాత్రమే ఉన్నాయన్నారు. బీజేపీ-బీఆర్ఎస్ రెండూ తోడు దొంగలేనన్నారు. ఆ రెండు కలిసి కాంగ్రెస్‌ను కార్నర్ చేయాలని చూస్తున్నాయని భట్టి విక్రమార్క అన్నారు.

Updated Date - 2023-03-19T15:41:55+05:30 IST