Smartphone Charging: ఈ నిజం తెలియకపోతే స్మార్ట్‌ఫోన్‌ను వాడటం వృథా.. అసలు చార్జింగ్ ఎంత ఉండాలో.. ఎంతలోపు ఉండకూడదో తెలుసా..?

ABN , First Publish Date - 2023-02-26T11:19:58+05:30 IST

అసలు ఛార్జింగ్ పెట్టడానికి ఓ రూల్ ఉందన్న విషయం అయినా తెలుసా..

Smartphone Charging: ఈ నిజం తెలియకపోతే స్మార్ట్‌ఫోన్‌ను వాడటం వృథా.. అసలు చార్జింగ్ ఎంత ఉండాలో.. ఎంతలోపు ఉండకూడదో తెలుసా..?

మొబైల్ ఫోన్(Mobile Phone) వాడినంత బాగా మొబైల్ ఫోన్ గురించి వివరాలు తెలియవు చాలా మందికి. మొబైల్ ఫోన్ కొన్నామా, నచ్చినట్టు వాడామా, అది పాడైతే మళ్ళీ కొత్తది కొన్నామా ఇలాగే ఉంటుంది అందరి పరిస్థితి. బయటకు ఎక్కడికైనా వెళ్ళాలంటే మొబైల్ బ్యాటరీ ఫుల్(Battery Full).. హమ్మయ్య నా మొబైల్ సేఫ్.. అనుకుంటారు, లో బ్యాటరీ(Low Battery) చూపిస్తే మారథాన్ రన్ చేసి ఛార్జింగ్ పెట్టి ఇంక మొబైల్ సేఫ్ అనుకుంటారు. కానీ మొబైల్ ఛార్జింగ్ ఎంత ఉంటే మొబైల్ సేఫ్ అనే విషయం మీకు తెలుసా? అసలు ఛార్జింగ్ పెట్టడానికి ఓ రూల్ ఉందన్న విషయం అయినా తెలుసా..

మొబైల్ ఫోన్ సెట్టింగ్స్(Mobile Phone Settings) గురించి, మొబైల్ వాడకం(Mobile usage) గురించి తెలిసినంత బాగా మొబైల్ వాడటంలో ఉన్న కొన్ని రూల్స్(Mobile Phone rules) తెలియవు చాలామందికి. వాటిలో మొబైల్ ఛార్జింగ్(Mobile Charging) పెట్టడం కూడా ఒకటి. ఛార్జింగ్ పెట్టడానికి ఒక రూల్ ఉందంటే కాస్త ఆశ్చర్యం వేస్తుంది కానీ అది నిజమండీ బాబు.. ఇప్పటికాలంలో మొబైల్ లో బ్యాటరీ లైఫ్(Mobile Battery Life) 2-3సంవత్సరాలు. జాగ్రత్తగా గమనిస్తే మొబైల్ కొన్న రెండు మూడేళ్ళ తరువాత మొబైల్ బ్యాటరీ పనితీరు కాస్త వీకవుతుంది(Mobile Battery Weak). చాలా తొందరగా బ్యాటరీ అయిపోతుంది. కానీ మొబైల్ కొన్న కొత్తలో పనిచేసినట్టు బ్యాటరీ చక్కగా పనిచేయాలంటే 40-80రూల్(40-80 rule) తప్పనిసరిగా పాటించాలి.

Read also: Mobile Data: అస్సలు వాడకపోయినా మొబైల్ డేటా వెంటనే అయిపోతోందా..? అయితే వెంటనే ఈ సెట్టింగ్‌ను ఆపేసుకోండి..!


40-80రూల్ ఏంటి?

చాలా మందిఈ రూల్ గురించి విని ఉండవచ్చు, కొందరు ఎక్కడైనా దీని గురించి చదివి ఉండవచ్చు. కానీ వివరంగా తెలుసుకుని పాటించేవాళ్ళు చాలా తక్కువ. మొబైల్ బ్యాటరీ 40శాతం కంటే తక్కువ(Below 40%) ఉండకూదడు, అలాగే 80శాతం కంటే ఎక్కువ(Above 80%) ఛార్జింగ్ చేయకూడదు. ఇదే ఈ 40-80రూల్. బ్యాటరీ 100శాతం ఛార్జ్ చేసి మొబైల్ సేఫ్ అనుకునేవారికి కాస్త షాక్ ఇచ్చే విషయమే ఇది. బ్యాటరీ ఫుల్ గా ఛార్జింగ్ చేయడం వల్ల బ్యాటరీ వీకవుతుంది. ఈ కారణంగానే మొబైల్ కొన్న ఓ రెండేళ్ళ తరువాత బ్యాటరీ ఫుల్ గా ఛార్జింగ్ పెట్టినా తొందరగా డ్రై(Battery Dry) అయిపోతుంది. ఇలా కాకుండా మొబైల్ పనితీరు కొత్త ఫోన్ లా ఉండాలంటే 40కి80కి మధ్య ఛార్జింగ్ ఉంచుకోవడం మంచిది. ల్యాప్టాప్(Laptop) కు కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. మొబైల్ ను ల్యాప్టాప్ ను ఇలా 40-80 రూల్ తో ఛార్జింగ్ చేసి కొన్నిరోజులు అబ్జర్వ్ చేశారంటే మొబైల్ పనితీరులో తేడా మీకే స్పష్టంగా కనిపిస్తుంది.

Updated Date - 2023-02-26T11:20:02+05:30 IST