Lava Blaze Pro 5G: లావా నుంచి సరికొత్త 5జీ ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతంటే..
ABN , First Publish Date - 2023-09-26T16:41:52+05:30 IST
భారతీయ స్మార్ట్‌ఫోన్ తయారీదారు లావా (Lawa) సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ ‘బ్లేజ్ ప్రో 5జీ’ (Lawa Blaze Pro 5G) ఆవిష్కరించింది. 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియెంట్ ధర రూ.12,499గా ఉంది. అయితే అక్టోబర్ 3 నుంచి లావా ఇండియా వెబ్‌సైట్, అమెజాన్ ఇండియా ఈ-కామర్స్ స్టోర్‌తోపాటు ఆఫ్‌లైన్ స్టోర్లలో లభ్యమవనున్నాయి.
న్యూఢిల్లీ: భారతీయ స్మార్ట్‌ఫోన్ తయారీదారు లావా (Lawa) సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ ‘బ్లేజ్ ప్రో 5జీ’ (Lawa Blaze Pro 5G) ఆవిష్కరించింది. 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియెంట్ ధర రూ.12,499గా ఉంది. అయితే అక్టోబర్ 3 నుంచి లావా ఇండియా వెబ్‌సైట్, అమెజాన్ ఇండియా ఈ-కామర్స్ స్టోర్‌తోపాటు ఆఫ్‌లైన్ స్టోర్లలో లభ్యమవనున్నాయి. కాగా అన్ని లావా ఫోన్ల మాదిరిగానే ఈ ఫోన్‌కు కూడా ఇంటి వద్ద సర్వీసులు చేయించుకోవచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్‌తో తయారు చేసినట్టు కంపెనీ తెలిపింది. వర్చువల్ ర్యామ్, 128జీబీ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ద్వారా యూజర్లు మరో 8జీబీ మేర ర్యామ్‌ను పెంచుకోవచ్చు.
ఫీచర్లు ఇవే..
ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. లావా బ్లేజ్ ప్రో 5జీ 17.22 సీఎం(6.78-ఇంచ్) ఎఫ్‌హెచ్‌డీ+ డిస్‌ప్లేతో లభిస్తోంది. రిఫ్రెష్ రేటు 120 హెడ్జ్‌గా ఉంది. టైప్-సీ పోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో లభిస్తోంది. 33వాట్స్ ఫాస్ట్ ఛార్జర్‌ను ఆఫర్ చేస్తోంది.
కెమెరా విషయానికి వస్తే ఈ ఫోన్ డ్యుయెల్ కెమెరా సెటప్‌తో వచ్చింది. ప్రైమరీ కెమెరా 50ఎంపీగా ఉంది. ఫ్రంట్ కెమెరా 8ఎంపీగా ఉంది. ఫిల్మ్, స్లో మోషన్, టైమ్‌ల్యాప్స్, యూహెచ్‌డీ, గిఫ్, బ్యూటీ, హెచ్‌డీఆర్, నైట్, పొట్రాయిట్, ఏఐ, ప్రో, పనోరమా, ఫిల్టర్స్, ఇంటెలిజెంట్ స్కానింగ్ వంటి వేర్వేరు షూటింగ్ మోడ్స్‌లో ఫోన్‌ను అందిస్తోంది. రెండు కలర్లలో ఫోన్ లభిస్తుంది. ఫేస్ అన్‌లాక్, ఫింగర్ సెన్సార్ వంటి సెక్యూరిటీ ఫీచర్లను అందిస్తోంది. కాగా రెడ్‌మీ 12 5జీ, పొకో ఎం6 ప్రో, రియల్‌మీ నర్జో 60ఎక్స్ వంటి ఫోన్లతో మార్కెట్‌లో లావా సరికొత్త ఫోన్ పోటీపడనుంది.