WTC Final Australia vs India: కీలక పోరులో కుప్పకూలిన టీం ఇండియా టాప్ ఆర్డర్..

ABN , First Publish Date - 2023-06-08T23:19:02+05:30 IST

కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియా -భారత్ (Australia vs India) మధ్య జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (WTC Final) మ్యాచ్‌లో టీం ఇండియా విజయ అవకాశాలు దాదాపు చేజారిపోయినట్లయింది.

WTC Final Australia vs India: కీలక పోరులో కుప్పకూలిన టీం ఇండియా టాప్ ఆర్డర్..

లండన్: కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియా -భారత్ (Australia vs India) మధ్య జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (WTC Final) మ్యాచ్‌లో టీం ఇండియా విజయ అవకాశాలు దాదాపు చేజారిపోయినట్లయింది. 100 పరుగుల లోపే దాదాపు టీం ఇండియా టాప్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. దాంతో భారత స్కోర్ పడిపోయింది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 38 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 151 పరుగులు మాత్రమే చేసింది.

డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్ ఆరంభంలో దెబ్బ మీద దెబ్బ పడింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. జట్టు స్కోరు 30 పరుగుల వద్దే వీరిద్దరూ ఔటయ్యారు. వ్యక్తిగత స్కోరు 15 పరుగుల వద్ద కెప్టెన్ రోహిత్ ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో వికెట్లు ముందు దొరికిపోయాడు. ఎల్‌బీడబ్ల్యూగా ఔటయ్యాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వ్యక్తిగత స్కోరు 13 పరుగుల వద్ద క్లియర్ బౌల్డ్ అయ్యాడు.

తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు 469 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

Updated Date - 2023-06-08T23:21:46+05:30 IST