Tushar Deshpande: అట్టహాసంగా CSK పేసర్ తుషార్ దేశ్‌పాండే నిశ్చితార్థం
ABN , First Publish Date - 2023-06-13T18:58:31+05:30 IST
తాను పాఠశాలలోనే ఇష్టపడ్డ నభా గడ్డంవార్‌తో (Nabha Gaddamwar) చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పేసర్ తుషార్ దేశ్‌పాండే (Tushar Deshpande) నిశ్చితార్థం వేడుక అట్టహాసంగా జరిగింది.
ముంబై: తాను పాఠశాలలోనే ఇష్టపడ్డ నభా గడ్డంవార్‌తో (Nabha Gaddamwar) చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పేసర్ తుషార్ దేశ్‌పాండే (Tushar Deshpande) నిశ్చితార్థం వేడుక అట్టహాసంగా జరిగింది. స్కూల్ దశలోనే నభా గడ్డంవార్‌ను తాను ఇష్టపడినట్లు తుషార్ తెలిపారు.
సీఎస్కే యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ తన దీర్ఘకాల స్నేహితురాలు ఉత్కర్ష పవార్‌ను వివాహం చేసుకున్న కొన్ని రోజులకే మరొక చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు పేసర్ తుషార్ దేశ్‌పాండే తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు.
నభా గడ్డంవార్‌తో తన నిశ్చితార్థం వేడుక ముంబైలో అట్టహాసంగా జరిగిందని తెలిపారు. IPL 2023లో సీఎస్కే విజయంలో 28 ఏళ్ల పేసర్ తుషార్ కీలక పాత్ర పోషించాడు. గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి మే 29న తమ 5వ టైటిల్‌ను ఎగరేసుకుపోయారు.