Australian Open2023: ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను 10వసారి ముద్దాడిన జకోవిచ్

ABN , First Publish Date - 2023-01-29T17:57:40+05:30 IST

సెర్బియన్ టెన్నిస్ దిగ్గజం నోవాక్ జకోవిచ్ (Novak Djokovic) సంచలనం సృష్టించాడు. ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 (Australian Open2023) విజేతగా అవతరించాడు.

Australian Open2023: ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను 10వసారి ముద్దాడిన జకోవిచ్

మెల్‌బోర్న్: సెర్బియన్ టెన్నిస్ దిగ్గజం నోవాక్ జకోవిచ్ (Novak Djokovic) సంచలనం సృష్టించాడు. ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 (Australian Open2023) విజేతగా అవతరించాడు. మెన్స్ సింగిల్స్ ఫైనల్‌లో ప్రత్యర్థి స్టెఫనోస్ త్సిత్సిపాస్‌ను (Stefanos Tsitsipas) సునాయాసంగా మట్టికరిపించాడు. 3 సెట్లలోనే ఫలితాన్ని డిసైడ్ చేశాడు. 2 గంటల 56 నిమిషాలపాటు కొనసాగిన ఈ మ్యాచ్‌లో త్సిత్సిపాస్‌ను వరుస సెట్లలో 6-3, 7-6 (4), 7-6 (5) తేడాతో ఓడించాడు. 24 ఏళ్ల స్టెఫనోస్ త్సిత్సిపాస్‌ చక్కటి పోరాట పటిమ కనబరిచినప్పటికీ జకోవిచ్ ముందు నిలువలేకపోయాడు. దీంతో ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను ఏకంగా 10వసారి జకోవిచ్ సొంతం చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా జకోవిచ్ నిలిచాడు. తాజా విజయంతో జకోవిచ్ తన కెరియర్‌లో 22వ గ్రాండ్ స్లామ్‌ టైటిల్‌ను గెలుచుకున్నాడు. దీంతో 22 గ్రాండ్స్‌స్లామ్ టైటిల్స్ గెలుచుకున్న రఫేల్ నాదల్ (Rafel Nadal) సరసన చేరాడు. గతేడాదే రిటైర్ అయిన రోజెర్ ఫెదరర్ 20 గ్రాండ్స్ స్లామ్ టైటిల్స్ సాధించి 3వ స్థానంలో నిలిచాడు. తాజాగా ఆస్ట్రేలియా ఓపెన్ 2023 విజయంతో ఏటీపీ ర్యాంకింగ్స్‌లో నొవాక్ జకోవిచ్ నంబర్ 1 స్థానానికి దూసుకెళ్లాడు.

Updated Date - 2023-01-29T18:18:41+05:30 IST