IndvsAusCricket: టాస్ గెలిస్తే ఫలితం ఏమవుతుందో తెలుసు కదా...

ABN , First Publish Date - 2023-03-09T11:31:39+05:30 IST

భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగో క్రికెట్ టెస్టు లో ఆస్ట్రేలియా టాస్ గెలిచింది. అయితే ఇంతకు ముందు ఆడిన మూడు టెస్టు మ్యాచ్ లలో ఎవరు టాస్ గెలిచారో, ఫలితం ఎవరికీ వచ్చిందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది

IndvsAusCricket: టాస్ గెలిస్తే ఫలితం ఏమవుతుందో తెలుసు కదా...

భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో క్రికెట్ టెస్ట్ (IndvsAusCricket) అహమ్మదాబాద్ లో ప్రారంభం అయింది. ఆస్ట్రేలియా టాస్ గెలిచి బాటింగ్ చెయ్యాలని నిర్ణయించుకొని బాటింగ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకో చిన్న ట్విస్ట్ కూడా వుంది. (IndvsAusCricket) ఏంటి అంటే, ఈ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BorderGavaskarTrophy) లో ఇంతకు మూడు టెస్టుల ఫలితాలు ఒక్కసారి చూస్తే కనక, మనకి టాస్ గెలిస్తే ఏమవుతుందో అర్థం అయిపోతుంది. అయితే ఇప్పుడు మరి ఆస్ట్రేలియా టాస్ గెలిచింది కదా, మరి గత మూడు టెస్టుల్లో ఏమయిందో అదే ఈసారి కూడా అవుతుందా! చూడాలి మరి.

australianteam.jpg

ఇంతకీ, గత మూడు టెస్టుల్లో ఏమయిందో చూద్దాం. మొదటి టెస్ట్ నాగపూర్ లో అయింది. ఆస్ట్రేలియా కెప్టెన్ కమ్మిన్స్ (Pat Cummins) టాస్ గెలిచి బాటింగ్ ఎంచుకుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఘోరంగా విఫలం అయిన ఆస్ట్రేలియా మీద రోహిత్ శర్మ (Rohit Sharma) సారధ్యంలోని భారత జట్టు మొదటి నుండీ ఆధిక్యం కనపరుస్తూ ఆ టెస్టు ని ఇన్నింగ్స్ మరియు 132 పరుగుల తేడాతో గెలిచింది.

ఇక రెండో టెస్టు ఢిల్లీ లో అయింది. ఇక్కడ కూడా ఆస్ట్రేలియా నే టాస్ గెలిచి బాటింగ్ తీసుకుంది. మొదటి ఇన్నింగ్స్ లో 263 పరుగులు చెయ్యగా, భారత జట్టు కూడా 262 పరుగులు చేసింది. అయితే ఇక్కడ ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్ లో కుప్పకూలిపోయింది. కేవలం 113 పరుగులకే అల్ అవుట్ అయింది. భారత జట్టు అతి సునాయాసంగా 6 వికెట్ల తేడాతో గెలిచింది.

ఇక మూడో టెస్టు ఇండోర్ లో అయింది, ఇక్కడ ఈసారి భారత జట్టు టాస్ గెలిచింది, బ్యాటింగ్ ఎంచుకుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో కుప్పకూలింది భారత్. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ (Steve Smith) మొదటి నుండీ ఈ టెస్టు లో పై చేయి సాధిస్తూ వచ్చింది. భారత జట్టు రెండో ఇన్నింగ్స్ లో కుప్పకూలిపోయింది, ఆస్ట్రేలియా అతి సునాయాసంగా ఈ మూడో టెస్టు గెలిచింది. భారత జట్టు మూడో టెస్ట్ గెలిస్తే, వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కి వెళ్లిపోయేది, కానీ ఇప్పుడు నాలుగో టెస్ట్ కచ్చితంగా గెలవాలి.

అయితే పై మూడు టెస్టులు పరిశీలిస్తే, ఎవరు టాస్ గెలిస్తే ఆ జట్టు ఘోరంగా ఓడిపోతోంది. మరి ఇప్పుడు అహమ్మదాబాద్ (Ahmedabad) నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బాటింగ్ ఎంచుకుంది. మరి పై మూడు టెస్టుల ఫలితాలను బట్టి చూస్తే, టాస్ ఓడిపోవటానికి సంకేతంలా కనపడుతోంది. ఈ టెస్ట్ ఫలితం ఎలా ఉండబోతోందో వేచి చూద్దాం...

Updated Date - 2023-03-09T11:36:01+05:30 IST