RCBvsMI: రోహిత్ శర్మ వ్యూహాత్మక నిర్ణయం.. టాస్ గెలిచిన ముంబై తెలివిగా ఏం ఎంచుకుందంటే..

ABN , First Publish Date - 2023-05-09T19:22:09+05:30 IST

ఐపీఎల్ సీజన్-16లో మరో రసవత్తర పోరుకు సమయం ఆసన్నమైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా..

RCBvsMI: రోహిత్ శర్మ వ్యూహాత్మక నిర్ణయం.. టాస్ గెలిచిన ముంబై తెలివిగా ఏం ఎంచుకుందంటే..

ఐపీఎల్ సీజన్-16లో మరో రసవత్తర పోరుకు సమయం ఆసన్నమైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ స్టేడియంలో చాలా తక్కువ స్కోర్‌కు కట్టడి చేసి ప్రత్యర్థి జట్లను తాము ఓడించామని, ఆ ఆత్మ విశ్వాసంతోనే టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నామని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు.

FvsMmGHaMAI806q.jpg

ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ జట్టు 8వ స్థానంలో ఉండగా, డుప్లెసిస్ నాయకత్వం వహిస్తున్న బెంగళూరు జట్టు 6వ స్థానంలో ఉంది. ముంబై జట్టు ఇప్పటివరకూ 10 మ్యాచ్‌లు ఆడి, 5 గెలిచి, 5 ఓడింది. బెంగళూరు జట్టు కూడా 10 మ్యాచ్‌లు ఆడగా, ఐదింట విజయం సాధించి, ఐదు ఓడిపోవడం గమనార్హం.

FvsNPxTaEAUd1uP.jpg

బెంగళూరు జట్టుకు నిలకడ లేని బ్యాటింగ్ ప్రధాన సమస్యగా మారింది. విరాట్ కోహ్లీ, డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ మినహాయిస్తే ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ ఆశించిన మేర రాణించడం లేదు. దినేశ్ కార్తీక్ ఫాం కోల్పోవడం గమనార్హం. ఇక.. ముంబై జట్టు విషయానికొస్తే.. జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ బ్యాటింగ్ ఆ జట్టు అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ సీజన్‌లో రోహిత్ శర్మ చెప్పుకోదగ్గ స్కోర్ చేసిన మ్యాచ్ ఒక్కటీ లేకపోవడం ఆ జట్టు అభిమానులకు నిరాశ కలిగించే విషయం. ఇరు జట్లలో మార్పు విషయానికొస్తే.. బెంగళూరు జట్టులో కర్ణ్ శర్మ స్థానంలో వైశాఖ్‌కు అవకాశం దక్కింది. ముంబై ఇండియన్స్ జట్టులో ఆర్చర్ స్థానంలో జోర్డాన్ ఆడనున్నాడు.

Updated Date - 2023-05-09T19:22:11+05:30 IST