IndiaVsAustralia: తొలిరోజు ఆట ముగిసింది.. భారత్ ఆలౌట్.. మరి ఆసీస్ స్కోరెంతంటే..

ABN , First Publish Date - 2023-03-01T17:46:47+05:30 IST

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ 20123లో (Border Gavaskar) భాగంగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా (IndiaVsAustralia) మధ్య ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది...

IndiaVsAustralia: తొలిరోజు ఆట ముగిసింది.. భారత్ ఆలౌట్.. మరి ఆసీస్ స్కోరెంతంటే..

ఇండోర్: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ 2023లో (Border Gavaskar) భాగంగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా (IndiaVsAustralia) మధ్య ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. ముగింపు సమయానికి పర్యాటక జట్టు ఆసీస్ స్కోరు 156/4 పరుగులుగా ఉంది. భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కేవలం 109 పరుగులకే ఆలౌట్ అవ్వడంతో ఆస్ట్రేలియా 47 పరుగులు ముందంజలో (లీడ్) నిలిచింది. ప్రస్తుతం పీటర్ హ్యాండ్స్‌కోంబ్, కెమెరాన్ గ్రీన్ క్రీజులో ఉన్నాడు. తొలి రోజు ఆటలో ఆసీస్ బ్యాట్స్‌మెన్లలో ఉస్మాన్ ఖవాజ్ అత్యధికంగా 60 పరుగులు చేసి ఔటయ్యాడు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తున్నప్పటికీ రెండో వికెట్‌కు ఖవాజా, లంబూసేన్ జోడీ చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఇక హెడ్ (9), లంబూసేన్ (31), స్టీవెన్ స్మిత్ (26) పరుగులు చేసి ఔటవ్వగా.. పీటర్ హ్యాండ్స్‌కోంబ్(7), కెమరూన్ గ్రీన్ క్రీజులో ఉన్నారు. ఇక ఆసీస్ కోల్పోయిన 4 వికెట్లను రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఒక్కడే తీశాడు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా కేవలం 109 పరుగులకే కుప్పకూలింది. కేవలం 33.2 ఓవర్లలో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. ఇండియా బ్యాట్స్‌మెన్లలో కేవలం ఇద్దరంటే ఇద్దరే 20 పరుగులకుపైగా స్కోరు చేశారు. 22 పరుగులు చేసిన కింగ్ కోహ్లీ టాప్ స్కోరర్‌గా నిలవగా.. 21 పరుగులు చేసిన శుభ్‌మన్ గిల్ సెకండ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రోహిత్ శర్మ (12), చతేశ్వర పుజారా (1), రవీంద్ర జడేజా (4), శ్రేయస్ అయ్యర్ (0), శ్రీకర్ భరత్ (17), అశ్విన్ (3), ఉమేష్ యాదవ్ (17), సిరాజ్(0), అక్షర్ పటేల్ (12 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు.

కాగా స్పిన్నర్లకు అనుకూలంగా ఇండోర్ పిచ్‌పై ఆస్ట్రేలియా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మ్యాథ్యూ కుహ్నేమాన్ రెచ్చిపోయాడు. ఏకంగా 5 వికెట్లు తీసి భారత బ్యాటింగ్ నడ్డి విరిచాడు. ఇక లియోన్‌ 3 వికెట్లు, ముర్ఫీ ఒక వికెట్ తీయగా ఒక వికెట్ రనౌట్ రూపంలో ఆసీస్‌కు లభించింది.

Updated Date - 2023-03-01T17:46:47+05:30 IST