WPL: వారియర్స్‌పై టాస్ గెలిచిన గుజరాత్

ABN , First Publish Date - 2023-03-20T15:53:02+05:30 IST

మహిళల ఐపీఎల్‌(WPL)లో మరో కీలక పోరు జరుగుతోంది. యూపీ వారియర్స్‌

WPL: వారియర్స్‌పై టాస్ గెలిచిన గుజరాత్

ముంబై: మహిళల ఐపీఎల్‌(WPL)లో మరో కీలక పోరు జరుగుతోంది. యూపీ వారియర్స్‌(UP Warriorz)తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్(Gujarat Giants) టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగింది. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ రెండింటిలో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పరిస్థితి కూడా ఇదే అయినా మెరుగైన రన్‌రేట్ కారణంగా గుజరాత్ కంటే పైన ఉంది.

ఇక, వారియర్స్ ఆరుమ్యాచ్‌లో మూడు ఓటములు, మూడు విజయాలతో మూడో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో కనుక మంచి రన్‌రేట్‌తో విజయం సాధిస్తే క్వాలిఫై అయ్యే అవకాశాలుంటాయి. అదే జరిగితే జెయింట్స్ ఇంటికి వెళ్లిపోతుంది. అంతేకాదు, ఆ జట్టు ఇప్పటికే అవకాశాలను మృగ్యం చేసుకుంది. ప్రస్తుతం మూడు ఓవర్లు ముగిశాయి. జెయింట్స్ వికెట్ నష్టపోకుండా 29 పరుగులు చేసింది. సోఫియా డంక్లీ (18), లారా వోల్వార్డ్ (10) క్రీజులో ఉన్నారు.

Updated Date - 2023-03-20T15:55:40+05:30 IST