WPL 2023: వారియర్స్‌ను స్వల్ప స్కోరుకే కట్టడి చేసిన ఢిల్లీ కేపిటల్స్

ABN , First Publish Date - 2023-03-21T21:15:44+05:30 IST

చూస్తుంటే ఢిల్లీ కేపిటల్స్(Delhi Capitals) నేరుగా ఫైనల్‌కు వెళ్లేలా కనిపిస్తోంది. యూపీ వారియర్స్‌(UP

WPL 2023: వారియర్స్‌ను స్వల్ప స్కోరుకే కట్టడి చేసిన ఢిల్లీ కేపిటల్స్

ముంబై: చూస్తుంటే ఢిల్లీ కేపిటల్స్(Delhi Capitals) నేరుగా ఫైనల్‌కు వెళ్లేలా కనిపిస్తోంది. యూపీ వారియర్స్‌(UP Warriorz)ను 138 పరుగుల స్వల్ప స్కోరుకే పరిమితం చేసి మ్యాచ్‌పై పట్టుబిగించింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన యూపీకి మంచి ఆరంభమే లభించినప్పటికీ దానిని కడవరకు కొనసాగించలేకపోయింది. 12 ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసిన యూపీ పటిష్టంగానే కనిపించింది. చేతిలో వికెట్లు మిగిలి ఉన్నాయి కాబట్టి స్కోరు పరుగులు తీస్తుందని భావించారు.

అయితే, ఆ తర్వాత యూపీ బ్యాటర్లు జిడ్డు ఆటతో విసుగుపుట్టించారు. ఇన్నింగ్స్ చప్పగా సాగింది. మరోవైపు, అడపాదడపా వికెట్లు తీస్తూ ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి పెంచిన ఢిల్లీ బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేస్తూ 138 పరుగులకు కట్టడి చేశారు. యూపీ బ్యాటర్లలో తహ్లియా మెక్‌గ్రాత్ 58 (నాటౌట్) జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచింది. కెప్టెన్ అలిస్సా హీలీ 36, శ్వేతా షెరావత్ 19, సిమ్రన్ షేక్ 11 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో అలీస్ కాప్సీ మూడు, రాధా యాదవ్ 2 వికెట్లు తీసుకున్నారు.

Updated Date - 2023-03-21T21:15:44+05:30 IST