Womens T20 World Cup 2023 Semis: ఉత్కంఠ పోరులో భారత్ పరాజయం..

ABN , First Publish Date - 2023-02-23T18:24:21+05:30 IST

మహిళల టీ20 ప్రపంచకప్‌(Women's T20 World Cup)లో భాగంగా మరికాసేపట్లో

Womens T20 World Cup 2023 Semis: ఉత్కంఠ పోరులో భారత్ పరాజయం..

09:50 PM: మహిళల టీ20 వరల్డ్ కప్ 2023 (ICC Women's T20 World Cup) సెమీస్ పోరులో భారత్ ఓటమిపాలైంది. లక్ష్య చేధనలో భారత బ్యాట్స్‌ఉమెన్స్ అద్భుతంగా రాణించినప్పటికీ.. ఉత్కంఠ పోరులో కేవలం 5 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది. గార్డెనర్ వేసిన చివరి ఓవర్‌లో 16 పరుగులు అవసరమవ్వగా 10 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో ఓటమి అనివార్యమైంది. బ్యాటింగ్, బౌలింగ్‌లలో అద్భుతంగా రాణించిన గార్డెనర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ (Player of the match) అవార్డ్ దక్కింది. ఈ విజయంతో టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా మరోసారి ఫైనల్ చేరింది.

కాగా 172 పరుగుల లక్ష్య చేధనకు బరిలోకి దిగిన భారత బ్యాట్స్‌ఉమెన్స్ టాపార్డర్ విఫలమైంది. 30 పరుగుల లోపే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ - రొడ్రిగేజ్ జోడీ చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. కీలక సమయంలో వికెట్లు పడడం.. ఆ తర్వాత వచ్చినవారు ధాటిగా ఆడలేకపోవడంతో ఓటమి ఖరారైంది.

భారత్ బ్యాటింగ్:

ఫెఫాలి వర్మ (9), స్మృతి మంధాన (2), యాస్తిక భాటియా(4), రోడ్రిగేజ్ (43), హర్మాన్ ప్రీత్ కౌర్ (52), రీచా ఘోష్ (14), దీప్తి శర్మ (20 నాటౌట్), స్నేహ్ రాణా (11), రాధా యాదవ్ (0), శిఖా పాండే (1 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో గార్డెనర్, బ్రౌన్ చెరో 2 వికెట్లు తీయగా.. మేగన్, జెస్ చెరో వికెట్ తీశారు.

Untitled-2.jpg

09:40 pm: ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2023 సెమీస్ పోరులో ఆస్ట్రేలియా చేతిలో భారత్ జట్టు ఓటమిపాలైంది. చక్కటి పోరాటపటిమ కనబర్చినప్పటికీ ఉత్కంఠ పోరులో ఓటమి తప్పలేదు.

09:36 pm: భారత విజయానికి చివరి ఓవర్‌లో 16 పరుగులు కావాలి. కాగా భారత్ ఏడవ వికెట్ కోల్పోయింది.

09:31 pm: భారత విజయానికి చివరి 2 ఓవర్లలో 20 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో దీప్తి శర్మ, రాణా ఉన్నారు. ప్రస్తుతం 18 ఓవర్లలో భారత్ స్కోరు 153/6 పరుగులుగా ఉంది.

09:24 pm: కీలక దశలో భారత్ మరో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 135 పరుగుల వద్ద రీచా ఘోష్ (14) 6వ వికెట్‌గా వెనుదిరిగింది.

09:19 PM: ఆసీస్ నిర్దేశించిన 173 పరుగుల భారీ లక్ష్య చేధనలో కెప్టెన్ హర్మాన్‌ప్రీత్ కౌర్ అదరగొట్టింది. అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని వ్యక్తిగత స్కోరు 52 పరుగుల వద్ద ఔటయ్యింది. 15 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 134/5 పరుగులుగా ఉంది.

09:10 PM: హర్మాన్‌ప్రీత్ కౌర్ - రీచా ఘోష్ జోడి భారత్‌ను లక్ష్యం దిశగా నడిపిస్తోంది. ఇంకా విజయానికి 36 బంతుల్లో 49 పరుగులు చేయాల్సి ఉంది. 14 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 128/4గా ఉంది.

09:36 pm: భారత విజయానికి చివరి ఓవర్‌లో 16 పరుగులు కావాలి. కాగా భారత్ ఏడవ వికెట్ కోల్పోయింది.

08:58 PM: లక్ష్య చేధనలో భారత్ బ్యాటింగ్ నిలకడగా కొనసాగుతోంది. 13 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 111/4 పరుగులుగా ఉంది. ప్రస్తుతం కెప్టెన్ హర్మాన్‌ప్రీత్ కౌర్ (38)- రీచా ఘోష్ (9) క్రీజులో ఉన్నారు.

08:58 PM: కెప్టెన్ హర్మాన్‌ప్రీత్ కౌర్- రోడ్రిగేజ్ జోడికి బ్రేక్ పడింది. దూకుడుగా ఆడిన రోడ్రిగేజ్ వ్యక్తిగత స్కోరు 43 పరుగుల వద్ద బ్రౌన్ బౌలింగ్‌లో క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగింది.

08:55 PM: కెప్టెన్ హర్మాన్‌ప్రీత్ కౌర్- రోడ్రిగేజ్ జోడీ కదం తొక్కింది. నాలుగవ వికెట్‌కు 39 బంతుల్లో 65 పరుగులు రాబట్టి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. 10 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 97/3 పరుగులుగా ఉంది. ప్రస్తుతం కెప్టెన్ హర్మాన్‌ప్రీత్ కౌర్(33), రోడ్రిగేజ్ (43) క్రీజులో ఉన్నారు.

Untitled-12.jpg

08:49 PM: 9 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 80/3 పరుగులుగా ఉంది. ప్రస్తుతం కెప్టెన్ హర్మాన్‌ప్రీత్ కౌర్(31), రోడ్రిగేజ్ (32) క్రీజులో ఉన్నారు.

08:27 PM: భారత్ స్కోరు 7 ఓవర్లు ముగిసేసరికి 65/3 పరుగులుగా ఉంది. ప్రస్తుతం కెప్టెన్ హర్మాన్‌ప్రీత్ కౌర్(25), రోడ్రిగేజ్ (23) క్రీజులో ఉన్నారు.

08:37 PM: భారీ లక్ష్య చేధనలో భారత్ ఆరంభంలోనే 3 వికెట్లు కోల్పోయినా రన్‌రేటు మెరుగ్గానే ఉంది. 6 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు 59/3 పరుగులుగా ఉంది. ప్రస్తుతం రన్‌రేటు 9.83 పరుగులుగా ఉండగా.. కావాల్సిన రన్‌రేట్ 8.14 పరుగులుగా ఉంది.

08:27 PM: భారత్ బ్యాట్స్‌ఉమెన్స్ టాపార్టర్ విఫలమైంది. కేవలం 28 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం 4 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 33/3 పరుగులుగా ఉంది. జట్టు స్కోరు 28 పరుగుల వద్ద యాస్తికా భాటియా రనౌట్ అయ్యింది.

08:21 PM: కొండంత లక్ష్య చేధనకు దిగిన భారత్ ఉమెన్స్ రెండవ వికెట్ కోల్పోయింది. ఓపెనర్‌గా వచ్చిన స్మృతి మంధాన వ్యక్తిగత స్కోరు 2 పరుగుల వద్ద గార్డెనర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది. ప్రస్తుతం 3 ఓవర్లకు జట్టు స్కోరు 26/2గా ఉంది.

08:15 PM: 173 పరుగుల లక్ష్య చేధనకు దిగిన భారత్ ఆరంభంలోనే తొలి వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 11 పరుగుల వద్ద ఓపెనర్ షెఫాలి వర్మ వ్యక్తిగత స్కోరు 9 పరుగుల వద్ద ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది.

Untitled-11.jpg

8:09 PM: తొలి ఓవర్ ముగిసే సమయానికి భారత్ స్కోరు 10 పరుగులుగా ఉంది. షెఫాలీ వర్మ, మందాన ఓపెనర్లుగా ఇన్నింగ్స్ ఆరంభించారు.

7:57 PM: మహిళల టీ20 వరల్డ్ కప్ సెమీస్ పోరులో దూకుడుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌ఉమెన్స్.. భారత్‌కు భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. 20 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 172 పరుగులు చేసింది. దీంతో భారత్ టార్గెట్ 173 పరుగులు సాధించాల్సి ఉంది.

7:53 PM: 19 ఓవర్లు ముగిసే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 1540/4గా ఉంది. కాగా జట్టు స్కోరు 148 పరుగుల వద్ద ఆస్ట్రేలియా నాలుగవ వికెట్ కోల్పోయింది.

7:46 PM: ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. ఆసీస్ స్కోరు 141 పరుగుల వద్ద గార్డెనర్‌ను దీప్తి శర్మ ఔట్ చేసింది. ప్రస్తుతం 18 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా స్కోరు 142/3గా ఉంది.

7:38 PM: ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ దూకుడు కొనసాగిస్తోంది. 15 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఉన్న మెగ్ లానింగ్, గార్డెనర్ దూకుడు పెంచి ఆడుతున్నారు.

7:30 PM: మ్యాచ్ 13 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు 94/2 పరుగులుగా ఉంది. ప్రస్తుతం మెగ్ లానింగ్(11), గార్డెనర్(3) క్రీజులో ఉన్నారు.

7:14 PM: 10 ఓవర్ల ముగిసేసరికి ఆస్ట్రేలియా ఒక వికెట్ నష్టానికి 69 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో బెత్ మూనీ (36), మెగ్ లానింగ్ (5) ఉన్నారు.

7:05 PM: 52 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. పేసర్ రాధా యాదవ్‌కు తొలి వికెట్ దక్కింది. వ్యక్తిగత స్కోరు 25 పరుగుల వద్ద ఆసీస్ ఓపెనర్ అలిస్సా హీలీ.. స్టంప్ ఔట్ రూపంలో వెనుదిరిగింది. కీపర్ రీచా ఘోష్ అద్భుతంగా స్టంప్ ఔట్ చేసింది.

7:03 PM: 7 ఓవర్ల ముగిసేసరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 47 పరుగులు చేసింది.

Untitled-7.jpg

6:59 PM: 6 ఓవర్ల ముగిసేసరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది.

మహిళల టీ20 ప్రపంచకప్‌(Women's T20 World Cup)లో భాగంగా మరికాసేపట్లో భారత్(Team India)-ఆస్ట్రేలియా(Australia) జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ఆసీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. అనారోగ్యం కారణంగా పేసర్ పూజా వస్త్రాకర్(Pooja Vastrakar) జట్టుకు దూరం కాగా, ఆమె స్థానంలో స్నేహ్ రాణా(Sneh Rana) జట్టులోకి వచ్చింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్(Harmanpreet Kaur) కూడా కొంత అస్వస్థతకు గురైనప్పటికీ కోలుకోవడంతో తుదిజట్టులోకి వచ్చింది. భారత జట్టుకు ఇది కొంత శుభవార్తే. అలాగే, రాజేశ్వరి గైక్వాడ్ స్థానంలో రాధా యాదవ్ తుది జట్టులోకి రాగా, దేవిక స్థానంలో యస్తికా భాటియా తుది జట్టులోకి వచ్చింది.

ఇక, ఆస్ట్రేలియా జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. అలన కింగ్ స్థానంలో జెస్ జోనాసెన్, అన్నాబెల్ సుథెర్‌లాండ్ స్థానంలో అలిస్సా హీలీ జట్టులోకి వచ్చారు. కాగా, 2016 నుంచి టీ20 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాను ఓడించిన ఏకైక జట్టు టీమిండియానే. 2020, 2018 ఎడిషన్‌లో రెండుసార్లు గ్రూప్ స్టేజ్‌లో ఆస్ట్రేలియాను భారత జట్టు చిత్తు చేసింది. ఇప్పుడు కూడా అదే రికార్డును నిలబెట్టుకుని ఫైనల్‌కు దూసుకెళ్లాలని హర్మన్ సేన పట్టుదలగా ఉంది.

Updated Date - 2023-02-23T22:09:52+05:30 IST