Share News

Legends League: చెలరేగిన గురుకీరత్.. లెజెండ్స్ లీగ్‌లో హైదరాబాద్ జట్టు విజయం

ABN , First Publish Date - 2023-11-23T21:52:49+05:30 IST

Legends League: లెజెండ్స్ లీగ్ ఆసక్తికరంగా సాగుతోంది. అలనాటి క్రికెటర్లతో ఆరు జట్ల మధ్య జరుగుతున్న ఈ లీగ్ పోటాపోటీగా జరుగుతుండటంతో క్రికెట్ అభిమానులు కేరింతలు కొడుతున్నారు. గురువారం ఇండియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్బన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 3 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది.

Legends League: చెలరేగిన గురుకీరత్.. లెజెండ్స్ లీగ్‌లో హైదరాబాద్ జట్టు విజయం

లెజెండ్స్ లీగ్ ఆసక్తికరంగా సాగుతోంది. అలనాటి క్రికెటర్లతో ఆరు జట్ల మధ్య జరుగుతున్న ఈ లీగ్ పోటాపోటీగా జరుగుతుండటంతో క్రికెట్ అభిమానులు కేరింతలు కొడుతున్నారు. గురువారం ఇండియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్బన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 3 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. రాంచీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా క్యాపిటల్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో అర్బన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్‌కు దిగగా ఆదిలోనే ఈ జట్టుకు షాక్ తగిలింది. ఓపెనర్లు డ్వేన్ స్మిత్ (3), మార్టిన్ గప్తిల్ (2) స్వల్ప స్కోర్లకే ఔట్ అయ్యారు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన గురుకీరత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 54 బాల్స్‌లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 89 పరుగులు చేశాడు. అతడికి కెప్టెన్ సురేష్ రైనా (46) మంచి సహకారం అందించాడు. పీటర్ ట్రెగో (36) కూడా రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో అర్బన్ రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఇండియా క్యాపిటల్స్ బౌలర్లలో ఇరుసు ఉదాన 2 వికెట్లు, మునాఫ్, కేపీ అప్పన్న, తెరాన్ తలో వికెట్ పడగొట్టారు.

190 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇండియా క్యాపిటల్స్‌కు కూడా ఆదిలోనే షాక్ తగిలింది. కెప్టెన్ గౌతం గంభీర్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. హషీమ్ ఆమ్లా (5) కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. కిర్క్ ఎడ్వర్డ్స్ (11) కూడా విఫలం కావడంతో ఇండియా క్యాపిటల్స్ జట్టు కష్టాల్లో పడింది. అయితే ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన కెవిన్ పీటర్సన్ 48 బాల్స్‌లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 77 పరుగులు చేసి గెలుపు ఆశలు రేపాడు. చివర్లో నర్స్ (41) కూడా గట్టిగా పోరాడాడు. అయితే హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో చివరకు 3 పరుగుల తేడాతో గంభీర్ జట్టు ఓటమిని చవి చూసింది. హైదరాబాద్ బౌలర్లలో మోఫు 2 వికెట్లు తీయగా.. ట్రెగో, బెస్ట్, సుయల్ తలో వికెట్ పడగొట్టారు. కాగా అర్బన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఈ లీగ్‌లో ఇది వరుసగా రెండో విజయం. ప్రస్తుతానికి పాయింట్ల పట్టికలో ఈ జట్టే అగ్రస్థానంలో ఉంది.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-23T21:52:50+05:30 IST