Jasprit Bumrah: బుమ్రా దంచికొట్టుడుకు ఏడాది పూర్తి

ABN , First Publish Date - 2023-07-02T12:59:00+05:30 IST

2022, జూలై 2న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్టులో బుమ్రా బ్యాట్‌తో రెచ్చిపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో బ్రాడ్ వేసిన బౌలింగ్‌లో అతడు మొత్తం 35 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సాధించాడు. ఈ ఓవర్‌లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లను బుమ్రా కొట్టాడు. బుమ్రా కంటే ముందు టెస్టు క్రికెట్‌లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు వెస్టిండీస్ మాజీ ఆటగాడు బ్రియాన్ లారా పేరిట ఉంది. లారా ఒకే ఓవర్‌లో 28 రన్స్ చేశాడు.

Jasprit Bumrah: బుమ్రా దంచికొట్టుడుకు ఏడాది పూర్తి

టీమిండియా కీలక బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) అంతర్జాతీయ క్రికెట్‌లో మైదానంలోకి అడుగుపెట్టి చాలా కాలం అవుతోంది. గాయం కారణంగా ఇటీవల ముగిసిన మెగా టీ20 లీగ్ ఐపీఎల్‌(IPL)లోనూ బుమ్రా ఆడలేకపోయాడు. వన్డే ప్రపంచకప్ నాటికి అతడు జట్టులోకి వస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే బౌలింగ్‌తో ప్రత్యర్థులను హడలెత్తించే బుమ్రా బ్యాటింగ్‌లో రాణించడం చాలా అరుదుగా కనిపిస్తుంది. అలాంటి సన్నివేశం గత ఏడాది ఇదే రోజున చోటుచేసుకుంది. ఇంగ్లండ్ సీనియర్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ (Stuart Broad) బౌలింగ్‌లో బుమ్రా దంచికొట్టాడు.

ఇది కూడా చదవండి: నీరజ్ చోప్రాపై ప్రధాని మోదీ ప్రశంసలు

2022, జూలై 2న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్టులో బుమ్రా బ్యాట్‌తో రెచ్చిపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో బ్రాడ్ వేసిన బౌలింగ్‌లో అతడు మొత్తం 35 పరుగులు చేసి ప్రపంచ రికార్డు (World Record) సాధించాడు. ఈ ఓవర్‌లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లను బుమ్రా కొట్టాడు. తొలి బాల్‌ను ఫోర్ కొట్టగా.. రెండో బాల్‌ను బ్రాడ్ వైడ్ వేశాడు. కానీ ఆ బాల్‌ను కూడా బుమ్రా ఫోర్‌గా మలిచాడు. ఇక మూడో బాల్‌ను నో బాల్‌గా వేయగా ఏకంగా సిక్సర్ సాధించాడు. ఆ తర్వాత వరుసగా మూడు బాల్స్‌ను బౌండరీకి తరలించాడు. మళ్లీ ఏడో బంతిని సిక్సర్‌గా మలిచాడు. చివరి బా‌ల్‌కు సింగిల్ తీశాడు. ఇలా మొత్తం 35 పరుగులు (35 Runs) పిండుకున్నాడు. దీంతో టెస్టు క్రికెట్‌లో బ్రాడ్ వేసిన ఓవర్ అత్యంత ఖరీదైన ఓవర్‌గా నిలిచింది. బుమ్రా కంటే ముందు టెస్టు క్రికెట్‌(Test Cricket)లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు వెస్టిండీస్ మాజీ ఆటగాడు బ్రియాన్ లారా (Brian Lara) పేరిట ఉంది. లారా ఒకే ఓవర్‌లో 28 రన్స్ చేశాడు.

Updated Date - 2023-07-02T13:09:14+05:30 IST