KL Rahul-Athiya: వివాహం అయిపోయింది.. ఐపీఎల్ తర్వాత రిసెప్షన్!

ABN , First Publish Date - 2023-01-23T19:57:38+05:30 IST

టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (KL Rahul)-బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె, నటి అతియా శెట్టి(Athiya Shetty) వివాహం

KL Rahul-Athiya: వివాహం అయిపోయింది.. ఐపీఎల్ తర్వాత రిసెప్షన్!

ముంబై: టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (KL Rahul)-బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె, నటి అతియా శెట్టి(Athiya Shetty) వివాహం బంధంతో ఒక్కటయ్యారు. ఖండాలాలోని సునీల్ శెట్టి (Suniel Shetty) ఫామ్ హౌస్‌లో కుటుంబ సభ్యులు, కొందరు సన్నిహితుల మధ్య వివాహం వైభవంగా జరిగింది. కుర్తా, సంప్రాదాయ నగలు ధరించి కనిపించిన సునీల్ శెట్టి విలేకరులతో మాట్లాడుతూ.. కేఎల్ రాహుల్-అతియా వివాహం వైభవంగా జరిగినట్టు తెలిపాడు. ఐపీఎల్ ముగిసిన తర్వాత రిసెప్షన్ ఉంటుందని పేర్కొన్నాడు. సునీల్ కుమారుడు అహాన్ శెట్టి బయట మీడియా ప్రతినిధులకు స్వీట్లు పంచుతూ కనిపించాడు.

Athiya-Shetty.jpg

వివాహ వేదిక బయట సునీల్ మీడియాతో మాట్లాడుతూ.. కొద్దిమంది కుటుంబ సభ్యుల మధ్య అత్యద్భుతంగా వివాహం జరిగినట్టు చెప్పాడు. పెళ్లి అధికారికంగా జరిగిపోయింది కాబట్టి తాను అధికారికంగా మామయ్యను అయిపోయానని ఆనందంగా చెప్పాడు. రిసెప్షన్ గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. బహుశా ఐపీఎల్ తర్వాత ఉంటుందని అన్నాడు.

rahul3.jpg

కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఈ వివాహానికి బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్, ఇషాంత్ శర్మ, అన్షుల్ కపూర్, కృష్ణా ష్రాఫ్ తదితరులు హాజరయ్యారు. అతిథులకు అరటి ఆకులపై దక్షిణ భారతదేశ వంటకాలతో విందు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.

Updated Date - 2023-01-23T20:34:30+05:30 IST