Indore Test: మూడో టెస్ట్ ఓటమికి కారణం చెప్పిన ఇయాన్ చాపెల్.. భారత జట్టులో అతిపెద్ద తేడా అదేనట!

ABN , First Publish Date - 2023-03-05T18:30:09+05:30 IST

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియా(Australia)తో

Indore Test: మూడో టెస్ట్ ఓటమికి కారణం చెప్పిన ఇయాన్ చాపెల్.. భారత జట్టులో అతిపెద్ద తేడా అదేనట!

ఇండోర్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియా(Australia)తో ఇండోర్‌(Indore Test)లో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఘోర పరాజయం పాలైంది. ఈ ఓటమిపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్(Ian Chappel) చాపెల్ స్పందించాడు. ఈ సిరీస్‌లో భారత్‌ జట్టులో ఉన్న అతిపెద్ద తేడా రిషభ్ పంత్(Rishabh Pant) లేకపోవడమేనని పేర్కొన్నాడు.

గతేడాది డిసెంబరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. శస్త్రచికిత్స తర్వాత ఇప్పుడిప్పుడే నడవగలుగుతున్నాడు. పంత్ కోలుకునేందుకు మరికొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అతడి స్థానాన్ని కేఎస్ భరత్‌(KS Bharat)కు మేనేజ్‌మెంట్ భర్తీ చేసింది. అయితే, భరత్ ఏమంత ఆకట్టుకోలేకపోతున్నాడు.

పంత్ కనుక జట్టులో ఉండి ఉంటే ప్రత్యర్థి ఒత్తిడిని తిప్పికొట్టగలిగి ఉండేవాడని మాజీ క్రికెటర్లు భావించారు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ మూడో రోజున దినేశ్ కార్తీక్ కూడా పంత్ లేని లోటును గుర్తు చేసుకున్నాడు.

చాపెల్ క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ.. ఆతిథ్య జట్టులో పంత్‌ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని, పంత్ లేకపోవడం పెద్ద తేడాలలో ఒకటని అన్నాడు. 25 ఏళ్ల పంత్ జట్టులో ఎంత ముఖ్యమైన ఆటగాడో అందరూ ఇప్పుడిప్పుడే చూస్తున్నారని చాపెల్ అన్నాడు. పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశాడు. పంత్ కనుక జట్టులో ఉండి ఉంటే మ్యాట్ కునేమన్, నాథన్ లయన్‌ను విడిచిపెట్టేవాడు కాదని అన్నాడు.

Updated Date - 2023-03-05T18:30:09+05:30 IST