Share News

IND vs AUS: తక్కువ స్కోరుకే టీమిండియా ఆలౌట్.. ఆస్ట్రేలియా లక్ష్యం ఎంతంటే?

ABN , First Publish Date - 2023-11-19T18:15:58+05:30 IST

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా తక్కువ స్కోరుకే తట్టాబుట్టా సర్దేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ వేసి..

IND vs AUS: తక్కువ స్కోరుకే టీమిండియా ఆలౌట్.. ఆస్ట్రేలియా లక్ష్యం ఎంతంటే?

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా తక్కువ స్కోరుకే తట్టాబుట్టా సర్దేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ వేసి.. టీమిండియాని అంత తక్కువ స్కోరుకే కట్టడి చేయగలిగారు. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (66), విరాట్ కోహ్లీ (54) అర్థశతకాలతో.. కెప్టెన్ రోహిత్ శర్మ 47 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో రాణించారు. మిగిలిన బ్యాటర్లు మాత్రం చేతులెత్తేశారు.


నిజానికి.. మొదట్లో భారత్ చేసిన శుభారంభం చూసి భారీ స్కోరు చేస్తుందని అంతా అనుకున్నారు. అఫ్‌కోర్స్.. శుభ్‌మన్ గిల్ వెంటనే ఔటైనప్పటికీ, రోహిత్ శర్మ ఎడాపెడా షాట్లతో చేలరేగి ఆడటంతో భారత్ స్కోరు రయ్యున పరుగులు పెట్టింది. కానీ.. ఎప్పుడైతే రోహిత్ ఔట్ అయ్యాడో, అప్పటి నుంచి స్కోరు డీలా పడిపోయింది. కోహ్లీ, రాహుల్ కొద్దిసేపు క్రీజులో ఉన్నంతసేపు స్కోరు పెరుగుతుందనే నమ్మకాలు ఉండేవి. కానీ.. వాళ్లు కూడా పోయాక జట్టు పరిస్థితి దయనీయంగా మారింది. రోహిత్, కోహ్లీ, రాహుల్ మాత్రమే పర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాటర్లు మాత్రం నిరాశాజనకమైన ప్రదర్శన కనబరిచారు. దీంతో.. భారత్ 240 పరుగులకే పరిమితం అయ్యింది.

ఇక ఆస్ట్రేలియా బౌలర్ల విషయానికొస్తే.. మిచెల్ స్టార్క్ 3 వికెట్లు, పాట్ కమిన్స్ & హాజెల్‌వుడ్ చెరో రెండు వికెట్లు.. జంపా, మ్యాక్స్‌వెల్ తలా వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ గెలుపొందాలంటే.. ఆస్ట్రేలియా 241 పరుగులు చేయాల్సి ఉంటుంది. షమీ జట్టులోకి తిరిగొచ్చినప్పటి నుంచి భారత్ బౌలింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్‌గా మారింది. దీంతో.. ఆ తక్కువ స్కోరుని భారత్ డిఫెండ్ చేయగలదన్న నమ్మకాలు అందరిలోనూ ఉన్నాయి. ఇంతకుముందు మ్యాచ్‌ల్లో రాణించినట్లే బౌలర్లు విజృంభిస్తే మాత్రం.. భారత్ గెలుపుని ఎవ్వరూ అడ్డుకోలేరు. మరి.. అది సాధ్యపడుతుందా?

Updated Date - 2023-11-19T18:15:59+05:30 IST