Share News

IND vs AUS Final: భారత్ ఓటమిపై సుప్రీంకోర్టు మాజీ జడ్జి వింత ట్వీట్

ABN , First Publish Date - 2023-11-20T16:17:13+05:30 IST

ఆదివారం (19-11-23) నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘోరపరాజయం పాలయ్యింది. బ్యాటింగ్, బౌలింగ్.. రెండింటిలోనూ విఫలం కావడంతో ఆసీస్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడింది. కానీ..

IND vs AUS Final: భారత్ ఓటమిపై సుప్రీంకోర్టు మాజీ జడ్జి వింత ట్వీట్

India vs Australia World Cup 2023 Final: ఆదివారం (19-11-23) నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘోరపరాజయం పాలయ్యింది. బ్యాటింగ్, బౌలింగ్.. రెండింటిలోనూ విఫలం కావడంతో ఆసీస్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడింది. కానీ.. కొందరు ‘మేధావులు’ మాత్రం భారత్ ఓటమికి ఇతర కారణాలు ఉన్నాయంటూ విచిత్రమైన వాదనలు చేస్తున్నారు. ఆయా సెంటిమెంట్లు కలిసి రాకపోవడం వల్లే భారత్ ఓడిందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారి జాబితాలో తాజాగా సుప్రీంకోర్టు మాజీ జడ్జి మార్కండేయ కట్జూ కూడా చేరిపోయారు. ఆయన చెప్పిన కారణం ఏంటో తెలిస్తే.. దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!


పాండవుల కాలంలో ఆస్ట్రేలియా మన భారతదేశానికి ఆయుధశాలగా ఉండేదని.. అందుకే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆ జట్టు భారత్‌పై విజయం సాధించిందని జస్టిస్ కట్జూ పేర్కొన్నారు. ‘‘పాండవుల కాలంలో ఆస్ట్రేలియా ‘అస్త్రాల’ నిల్వ కేంద్రంగా ఉండేది. ఆ రోజుల్లో దానిని ‘అస్త్రాలయా’ అని పిలిచేవారు. వాళ్లు ప్రపంచకప్ గెలవడానికి ఇదే అసలు కారణం’’ అని తన ఎక్స్ ఖాతాలో కట్జూ పోస్ట్ చేశారు. అయితే.. ఈ వింత కారణం నిజమని నిరూపించే ఎలాంటి రుజువులు గానీ, సందర్భం గానీ ఇవ్వలేదు. కేవలం.. ఆ ఒక్క ట్వీట్ చేసి వదిలేశారు. దీంతో.. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

కాగా.. జస్టిస్ కట్జూ తన అసాధారణ అభిప్రాయాలకు ప్రసిద్ధి చెందారు. 1970 నుండి 1991 వరకు అలహాబాద్ హైకోర్టులో తన న్యాయవాద అభ్యాసాన్ని ప్రారంభించారు. 2006లో భారత సుప్రీంకోర్టులో అడుగుపెట్టిన ఆయన.. 2011 సెప్టెంబర్‌లో పదవీ విరమణ పొందారు.

Updated Date - 2023-11-20T16:58:45+05:30 IST