ICC Womens T20 World Cup: సఫారీల జోరుకు ఎక్లెస్టోన్ అడ్డుకట్ట!

ABN , First Publish Date - 2023-02-24T20:26:09+05:30 IST

మహిళల టీ20 ప్రపంచకప్‌(ICC Womens T20 World Cup)లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో

 ICC Womens T20 World Cup: సఫారీల జోరుకు ఎక్లెస్టోన్ అడ్డుకట్ట!

కేప్‌టౌన్: మహిళల టీ20 ప్రపంచకప్‌(ICC Womens T20 World Cup)లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్‌లో దక్షిణాఫ్రికా భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా ఎలాంటి తడబాటు లేకుండా ఆడింది. ఓపెనర్లు లారా వోల్వార్ట్(Laura Wolvaardt), తజ్మీన్ బ్రిట్స్(Tazmin Brits) ఇంగ్లండ్ బౌలర్లను యథేచ్ఛగా ఆడుకున్నారు. బంతులను బౌండరీలు దాటిస్తూ స్కోరు బోర్డుపై పరుగులను పెంచుకుంటూ పోయారు.

ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 96 పరుగులు జోడించారు. ఈ క్రమంలో 44 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో అర్ధ సెంచరీ (53) పూర్తి చేసుకున్న వోల్వార్ట్.. ఎక్లెస్టోన్ బౌలింగులో చార్లొట్టెకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. మరోవైపు, క్రీజులో పాతుకుపోయిన తంజీమ్ బ్రిట్స్ బౌలర్లపై ప్రతాపం చూపించింది. యథేచ్ఛగా షాట్లు కొడుతూ స్కోరు వేగాన్ని పెంచింది. ఈ క్రమంలో 55 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేసి లారెన్ బౌలింగులో 142 పరుగుల వద్ద రెండో వికెట్‌గా వెనుదిరిగింది.

ఆ వెంటనే స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోవడంతో పరుగుల వేగం మందగించింది. ఫలితంగా 20 ఓవర్లలో 164 పరుగులు మాత్రమే చేయగలిగింది. మరిజానే కాప్ 27 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఎక్లెస్టోన్ మూడు వికెట్లు తీసి సఫారీల పరుగుల వేగానికి అడ్డుకట్ట వేసింది.

Updated Date - 2023-02-24T20:26:16+05:30 IST