Share News

IND Vs BAN: రాణించిన బంగ్లాదేశ్ బ్యాటర్లు.. టీమిండియా లక్ష్యం ఎంతంటే..?

ABN , First Publish Date - 2023-10-19T18:19:41+05:30 IST

టీమిండియాతో పూణె వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది.

IND Vs BAN: రాణించిన బంగ్లాదేశ్ బ్యాటర్లు.. టీమిండియా లక్ష్యం ఎంతంటే..?

పూణె వేదికగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ రాణించింది. సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బ్యాటర్లు పట్టుదల ప్రదర్శించారు. దీంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టుకు ఓపెనర్లు మంచి ఆరంభం ఇచ్చారు. తంజిద్ హసన్, లిట్టన్ దాస్ హాఫ్ సెంచరీలతో రాణించారు. ముఖ్యంగా తంజిద్ హసన్ దూకుడుగా ఆడాడు. 43 బాల్స్‌లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 51 పరుగులు సాధించాడు. లిట్టన్ దాస్ 82 బాల్స్‌లో 7 ఫోర్ల సహాయంతో 66 పరుగులు చేశాడు. దీంతో ఒక దశలో బంగ్లాదేశ్ 93/0 స్కోరుతో కనిపించింది. అయితే వీళ్ల భాగస్వామ్యాన్ని కుల్‌దీప్ విడదీశాడు. అక్కడి నుంచి బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో వేగం తగ్గింది.

ఇది కూడా చదవండి: Team India: ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంపై బీసీసీఐ అప్‌డేట్..!!

అయితే చివర్లో సీనియర్ ఆటగాళ్లు ముష్ఫీకర్ రహీమ్, మహ్మదుల్లా ఎడాపెడా బౌండరీలు బాదడంతో బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. ముష్పీ్కర్ 46 బంతుల్లో 38, మహ్మదుల్లా 36 బంతుల్లో 46 పరుగులు సాధించారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా, సిరాజ్, జడేజా రాణించారు. వీళ్లంతా తలో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. శార్దూల్ ఠాకూర్, కుల్‌దీప్ ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టారు. అంతకుముందు 9వ ఓవర్లో బౌలింగ్ చేసేందుకు వచ్చిన పాండ్య మూడు బాల్స్ వేసిన తర్వాత కాలి మడమ గాయానికి గురయ్యాడు. దీంతో పాండ్య మైదానం వీడి బయటకు వెళ్లాడు. అతడి ఓవర్‌లో మిగిలిన బాల్స్‌ను విరాట్ కోహ్లీ పూర్తి చేశాడు. సుమారు ఆరేళ్ల తర్వాత వన్డేల్లో విరాట్ కోహ్లీ బౌలింగ్ చేయడం గమనించాల్సిన విషయం. కాగా ఈ మ్యాచ్‌లో గెలవాలంటే టీమిండియా 259 పరుగులు చేయాలి. ఈ మ్యాచ్ గెలిస్తే పాయింట్ల పట్టికలో టీమిండియా మళ్లీ అగ్రస్థానానికి వెళ్లే అవకాశం ఉంది.

Updated Date - 2023-10-19T18:41:48+05:30 IST