Share News

IPL 2024: ముగ్గురు ఆప్ఘనిస్తాన్ క్రికెటర్లకు షాక్.. ఐపీఎల్‌ ఆడేందుకు నో ఛాన్స్

ABN , Publish Date - Dec 26 , 2023 | 05:56 PM

IPL 2024: ఐపీఎల్ ప్రారంభం కావడానికి ఇంకా మూడు నెలల సమయం ఉన్నా ఇప్పటి నుంచే సర్వత్రా చర్చ నడుస్తోంది. ఇప్పుడు ఆప్ఘనిస్తాన్ క్రికెటర్లు ఐపీఎల్‌లో పాల్గొనడం అనుమానంగా మారింది. పేసర్లు నవీన్ ఉల్ హక్, ఫజల్లా ఫరూఖీ, ముజీబుర్ రెహ్మాన్‌లు ఐపీఎల్‌లో పాల్గొనేందుకు వచ్చే రెండేళ్ల పాటు ఎన్‌వోసీ ఇవ్వకూడదని ఆప్ఘనిస్తాన్ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

IPL 2024: ముగ్గురు ఆప్ఘనిస్తాన్ క్రికెటర్లకు షాక్.. ఐపీఎల్‌ ఆడేందుకు నో ఛాన్స్

ఐపీఎల్ ప్రారంభం కావడానికి ఇంకా మూడు నెలల సమయం ఉన్నా ఇప్పటి నుంచే సర్వత్రా చర్చ నడుస్తోంది. ఐపీఎల్ వేలం తర్వాత రోహిత్, పాండ్యా గురించి అందరూ చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆప్ఘనిస్తాన్ క్రికెటర్లు ఐపీఎల్‌లో పాల్గొనడం అనుమానంగా మారింది. పేసర్లు నవీన్ ఉల్ హక్, ఫజల్లా ఫరూఖీ, ముజీబుర్ రెహ్మాన్‌లు ఐపీఎల్‌లో పాల్గొనేందుకు వచ్చే రెండేళ్ల పాటు ఎన్‌వోసీ ఇవ్వకూడదని ఆప్ఘనిస్తాన్ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో సదరు క్రికెటర్లు ఐపీఎల్ ఆడటం కష్టమే అని పలువురు చర్చించుకుంటున్నారు. ఇటీవల ఐపీఎల్ వేలంలో నవీన్ ఉల్ హక్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రిటైన్ చేసుకోగా.. ఫజల్లా ఫరూఖీని సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకుంది. ఇక ముజీబుర్ రెహ్మాన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ సొంతం చేసుకుంది.

కాగా జనవరి 1 నుంచి నవీన్ ఉల్ హక్, ఫజల్లా ఫరూఖీ, ముజీబుర్ రెహ్మాన్ సెంట్రల్ కాంట్రాక్టుకు అర్హులు కాదని ఆప్ఘనిస్తాన్ బోర్డు వెల్లడించింది. అవసరమైతే వారి భాగస్వామ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటామని.. అప్పుడే వాళ్ల కాంట్రాక్ట్‌పై పునరాలోచన చేస్తామని తెలిపింది. ఇప్పుడు అమల్లో ఉన్న ఎన్‌వోసీని రద్దు చేస్తున్నామని పేర్కొంది. జాతీయ జట్టు కంటే లీగ్‌లకే వీళ్లు ప్రాధాన్యం ఇస్తున్నారని గుర్తించామని.. అందుకే సెంట్రల్ కాంట్రాక్ట్‌ను హోల్డ్ చేశామని బోర్డు అధికారులు తెలిపారు. అయితే తమకు సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వకపోయినా కనీసం దేశవాళీ టోర్నీల్లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని ముగ్గురు ఆప్ఘనిస్తాన్ క్రికెటర్లు తమ బోర్డుకు విన్నపం చేసినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ కంటే ముందు ఆప్ఘనిస్తాన్ జట్టు భారత్‌లో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. తొలి టీ20 జనవరి 11న మొహాలీ, రెండో టీ20 జనవరి 14న ఇండోర్‌లో, మూడో టీ20 జనవరి 17న బెంగళూరులో జరుగుతాయి.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 26 , 2023 | 05:56 PM