WTC final: ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆసీస్ భారీ స్కోరు... మనోళ్లు ఏం చేస్తారో...

ABN , First Publish Date - 2023-06-08T19:03:22+05:30 IST

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా (India vs Australia) చరిత్రాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్2లో (WTC final) ఆసీస్ మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ శతకాలకుతోడు చివరిలో అలెక్స్ క్యారీ రాణించడంతో 469 పరుగుల భారీ స్కోరుకు ఆలౌటయ్యింది.

WTC final: ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆసీస్ భారీ స్కోరు... మనోళ్లు ఏం చేస్తారో...

ఓవల్: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా (India vs Australia) చరిత్రాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌లో (WTC final) ఆసీస్ మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ శతకాలకుతోడు చివరిలో అలెక్స్ క్యారీ రాణించడంతో 469 పరుగుల భారీ స్కోరుకు ఆలౌటయ్యింది. మొదటి రోజు తేలిపోయిన భారత బౌలర్లు రెండవ ఫర్వాలేదనిపించారు. ముఖ్యంగా పేసర్లు వరుస విరామాల్లో కీలక వికెట్లు తీసి ఆసీస్ ఇన్నింగ్స్‌ను శాసించారు. అత్యధికంగా మహ్మద్ సిరాజ్ 4 వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ షమీ, థాకూర్ చెరో 2 వికెట్లు, రవీంద్ర జడేజా 1 చొప్పున తీశారు. మరో వికెట్ రనౌట్ రూపంలో దక్కింది.

ఆసీస్ బ్యాటింగ్....

డేవిడ్ వార్నర్ (43), ఖవాజా (0), లబూసేన్ (26), స్టీవ్ స్మిత్ (121), ట్రావిస్ హెడ్ (163), కామెరూన్ గ్రీన్ (6), అలెక్స్ క్యారీ (46), స్టార్క్ (5), ప్యాట్ కమ్మిన్స్ (9), లియోన్ (9), బొలాండ్ (1 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు.

మొదలైన భారత బ్యాటింగ్...

ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 469 పరుగులకు ఆలౌట్ అవ్వడంతో భారత తొలి ఇన్నింగ్స్ మొదలైంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ క్రీజులోకి వచ్చారు. ప్రస్తుతం 3 ఓవర్లు ముగిసేసరికి 22/0 గా ఉంది. కాగా ఓవల్ మైదానంలో భారత బ్యాటర్లు ఎంతవరకు రాణిస్తారో చూడాలి. ఆస్ట్రేలియా స్కోరును అధిగమిస్తారా లేక ముందే ఆలౌట్ అవుతారా? అనేది వేచిచూడాలి.

Updated Date - 2023-06-08T19:09:13+05:30 IST