మహిళపై అత్యాచారయత్నం.. దుండగుడి నాలుక కొరికేసిన యువతి.. దాంతో ఏం చేసిందో తెలిస్తే షాక్!

ABN , First Publish Date - 2023-02-26T21:15:05+05:30 IST

ఆ మహిళ తన కుక్కను తీసుకుని రోడ్డుపై వాకింగ్‌కు వెళ్తోంది.. నిర్మానుష్య ప్రాంతంలో ఓ వ్యక్తి ఆ మహిళను అడ్డగించి అత్యాచార యత్నం చేశాడు

మహిళపై అత్యాచారయత్నం.. దుండగుడి నాలుక కొరికేసిన యువతి.. దాంతో ఏం చేసిందో తెలిస్తే షాక్!

ఆ మహిళ తన కుక్కను తీసుకుని రోడ్డుపై వాకింగ్‌కు వెళ్తోంది.. నిర్మానుష్య ప్రాంతంలో ఓ వ్యక్తి ఆ మహిళను అడ్డగించి అత్యాచార యత్నం చేశాడు (Sexual Harassment).. ఆమె బట్టలు లాగడం, బలవంతంగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకోవడం మొదలుపెట్టాడు.. ఆ దుండగుడు ముద్దు పెడుతున్న సమయంలో ఆ మహిళ అతడి నాలుకను కొరికేసింది.. దీంతో దుండగుడు పారిపోయాడు.. మహిళ వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆగంతకుడిపై ఫిర్యాదు చేసింది.. సాక్ష్యంగా ఆ వ్యక్తి నాలుకను అప్పగించింది.. దీంతో పోలీసులు షాకయ్యారు (Crime News).

ఫ్రాన్స్‌లోని (France) అవిగ్నాన్ నగరంలో వాకింగ్ చేస్తున్న ఒక మహిళపై ఓ అపరిచితుడు అత్యాచార యత్నం చేశాడు. ఆమెను కౌగిలించుకోవడం బలవంతంగా ముద్దుపెట్టుకోవడానికి ప్రయత్నించాడు. అతడు తనను ముద్దు పెట్టుకుంటుండగా ఆ మహిళ తీవ్ర ఆగ్రహంతో అతడి నాలుక కొరికేసింది (woman bites miscreant tongue). తీవ్ర బాధతో ఆ దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఆ మహిళ వెంటనే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి తనపై జరిగిన అత్యాచార యత్నం గురించి పోలీసులకు వివరించింది.

Mumbai: భార్యకు గుణపాఠం చెప్పాలనుకుని కథ అల్లాడు.. చివరకు పోలీసులకు దొరికిపోయాడు..!

తను చెబుతున్న దానికి సాక్ష్యంగా ఆ దుండగుడి నాలుక ముక్కను పోలీసులకు అందించింది. ఆ మహిళ ఇచ్చిన దాన్ని చూసి పోలీసులు కూడా షాక్ అయ్యారు. అనంతరం ఆ మహిళపై దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు. ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ మహిళ ధైర్యంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Updated Date - 2023-02-26T21:15:07+05:30 IST