Mumbai: భార్యకు గుణపాఠం చెప్పాలనుకుని కథ అల్లాడు.. చివరకు పోలీసులకు దొరికిపోయాడు..!

ABN , First Publish Date - 2023-02-26T19:46:35+05:30 IST

విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టే భార్యకు గుణపాఠం చెప్పాలనుకున్నాడు.. ఆమెకు విలువైన ఆర్థిక పాఠం నేర్పాలనుకున్నాడు.. స్వంతంగా ఓ కథ వండి ఆమెకు, పోలీసులకు చెప్పాడు.. అయితే..

Mumbai: భార్యకు గుణపాఠం చెప్పాలనుకుని కథ అల్లాడు.. చివరకు పోలీసులకు దొరికిపోయాడు..!

విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టే భార్యకు గుణపాఠం చెప్పాలనుకున్నాడు.. ఆమెకు విలువైన ఆర్థిక పాఠం నేర్పాలనుకున్నాడు.. స్వంతంగా ఓ కథ వండి ఆమెకు, పోలీసులకు చెప్పాడు.. అయితే చివరకు దొరికిపోయి కటకటాల పాలయ్యాడు.. ముంబైలో (Mumbai) ఈ ఘటన జరిగింది. అంధేరిలో నివసిస్తున్న అమీర్ వోరాకు అత్తగారు ఫ్లాట్ కొనడానికని రూ. 44 లక్షలు ఇచ్చారు. ఆ డబ్బులు తీసుకునేందుకు అమీర్ తన తండ్రితో కలిసి అత్తగారి ఊరు వెళ్లాడు. అయితే ఇంటికి మాత్రం ఖాళీ చేతులతో తిరిగి వచ్చాడు.

డబ్బులు ఏవి అని భార్య అడిగితే.. వచ్చే దారిలో తమపై దొంగలు దాడి చేశారని (Robbery), తమ వద్ద ఉన్న మొత్తం డబ్బును ఎత్తుకెళ్లిపోయారని చెప్పాడు. షాకైన భార్య వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి అమీర్‌ను ప్రశ్నించారు. అయితే అమీర్ చెప్పిన సమాధానాలు వారిలో అనుమానం రేకెత్తించాయి. దాంతో అమీర్ తండ్రిని ప్రశ్నించారు. కొడుకు ప్లాన్ గురించి తెలియని తండ్రిపై తమపై ఎవరూ దాడి చేయలేదని, డబ్బులు తన దగ్గరే ఉన్నాయని పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు అమీర్‌ను అదుపులోకి తీసుకున్నారు (Crime News).

తనకు దక్కనిది వేరేవరికీ దక్కకూడదంటూ భార్యను హెచ్చరించిన భర్త.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే..

భార్యకు గుణపాఠం నేర్పడానికి అలా చేశానని, తల్లి తరచుగా ఇచ్చే డబ్బులతో తన భార్య ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తోందని, ఈ డబ్బులను కూడా అలాగే ఖర్చు పెట్టేస్తుందనే భయంతో నాటకం ఆడానని పోలీసులకు చెప్పాడు (Husband and wife). పోలీసులు అమీర్‌పై సెక్షన్ 406 (శాంతికి విఘాతం) కింద కేసు పెట్టారు.

Updated Date - 2023-02-26T19:46:37+05:30 IST