Wife: ఏవండీ.. ఓ సెల్ఫీ తీసుకుందాంమంటూ భర్తను చెట్టు వద్దకు తీసుకెళ్లిన భార్య.. కేకలు విని చుట్టుపక్కల వాళ్లు వచ్చి చూస్తే..!

ABN , First Publish Date - 2023-06-13T18:31:09+05:30 IST

మానవ సంబంధాలు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. కలకాలం ఒకరికి ఒకరు తోడుంటామని ప్రమాణాలు చేసిన వారు ఆ ప్రమాణాలను మరిచి క్రూరులుగా ప్రవర్తిస్తున్నారు. క్షణిక సుఖం కోసం కట్టుకున్నవాళ్లనే

Wife: ఏవండీ.. ఓ సెల్ఫీ తీసుకుందాంమంటూ భర్తను చెట్టు వద్దకు తీసుకెళ్లిన భార్య.. కేకలు విని చుట్టుపక్కల వాళ్లు వచ్చి చూస్తే..!
Wife

మానవ సంబంధాలు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. కలకాలం ఒకరికి ఒకరు తోడుంటామని ప్రమాణాలు చేసిన వారు ఆ ప్రమాణాలను మరిచి క్రూరులుగా ప్రవర్తిస్తున్నారు. క్షణిక సుఖం కోసం కట్టుకున్నవాళ్లనే అడ్డు తొలగించుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు నిత్యం ఎక్కడో చోట జరుగుతూనే ఉంటున్నాయి. ఓ వైపు శిక్షలు పడినా మనుషుల్లో మాత్రం మార్పు రావడం లేదు.

ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు బాగా పెరిగిపోతున్నాయి. భర్త, పిల్లలు ఉన్నా సరే.. మరొకరిని కోరుకోవడం.. అలాగే భార్య, పిల్లలు ఉన్న భర్తలు కూడా మరొక స్త్రీని కోరుకోవడం.. ఇలాంటి బంధాలతో కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయితున్నాయి. పిల్లలు నడి బజారున పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే బీహార్‌లో చోటుచేసుకుంది. ప్రియుడి కోసం కట్టుకున్న భర్తనే కడతేర్చింది ఓ ఇల్లాలు.

బీహార్‌లోని (Bihar) ముజఫర్‌పుర్‌ జిల్లాలో వాసుదేవ్‌పుర్‌ సరాయ్‌ గ్రామానికి చెందిన 25 ఏళ్ల మహిళ(Wife).. సెల్ఫీ తీసుకుందామంటూ శనివారం రాత్రి భర్తను (husband) ఓ చెట్టు దగ్గరకు తీసుకెళ్లింది. అనంతరం భర్తను మాటల్లో పెట్టి చెట్టుకు కట్టేసింది. అంతటితో ఆగకుండా నోరు తెరిచి అరవకుండా ఉండేందుకు నోట్లో గుడ్డలు కుక్కేసింది. ఆ తర్వాత అతడి ఒంటిపై కిరోసిన్‌ చల్లి నిప్పు పెట్టింది. మంటలు తాళలేక అరవడానికి ప్రయత్నించినా ఎవరూ వినే పరిస్థితి లేదు. కానీ మంటలు చెలరేగడం చూసిన గ్రామస్తులు వెంటనే వచ్చి మంటలను ఆర్పారు. వెంటనే బాధితుడిని ఆస్పత్రిలో చేర్పించారు.

ddd.gif

భర్తపై ఇంతటి అఘాయిత్యానికి పాల్పడడానికి వివాహేతర సంబంధమేనని గ్రామస్తులు తేల్చారు. మహిళకు గ్రామంలో మరొకరితో వివాహేతర సంబంధం ఉందని.. అందుకే ఇంతటి దారుణానికి ఒడిగట్టిందని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితురాలిని కఠినంగా శిక్షించాలంటూ బాధితుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

Crime: పనికి వెళ్లి తిరిగొచ్చిన 15 ఏళ్ల కుమార్తె.. ఇంటి తలుపులు తీయగానే తండ్రి చేసిన నిర్వాకం చూసి..!

Updated Date - 2023-06-13T18:34:22+05:30 IST