Wife: భార్యకు ప్రభుత్వోద్యోగం వచ్చిందని సంతోషించాల్సింది పోయి ఈ భర్త ఇలా చేశాడేంటి..? ఒంటి చేత్తోనే ఆమె విధులు నిర్వహించడం వెనుక..!

ABN , First Publish Date - 2023-04-15T20:21:52+05:30 IST

భార్యకు ప్రభుత్వ ఉద్యోగం వస్తే.. సంతోషపడి.. 'నా భార్య ప్రభుత్వ ఉద్యోగం సాధించింది' అని గొప్పగా చెప్పుకోవాల్సిన భర్తే దారుణంగా ప్రవర్తించాడు. పెళ్ళైనా తన ప్టటు విడువకుండా కష్టపడి చదివి ఉద్యోగం తెచ్చుకున్న భార్యకు జీవితాంతం మర్చిపోలేని అనుభవాన్ని మిగిల్చాడు.

Wife: భార్యకు ప్రభుత్వోద్యోగం వచ్చిందని సంతోషించాల్సింది పోయి ఈ భర్త ఇలా చేశాడేంటి..? ఒంటి చేత్తోనే ఆమె విధులు నిర్వహించడం వెనుక..!

ప్రభుత్వ ఉద్యోగం ఎంతో మంది కల. కష్టపడి చదివినా పాయింట్ మార్కులతో ఉద్యోగం కోల్పోతుంటారు చాలామంది. అలాంటిది భార్యకు ప్రభుత్వ ఉద్యోగం వస్తే.. సంతోషపడి.. 'నా భార్య ప్రభుత్వ ఉద్యోగం సాధించింది' అని గొప్పగా చెప్పుకోవాల్సిన భర్తే దారుణంగా ప్రవర్తించాడు. పెళ్ళైనా తన ప్టటు విడువకుండా కష్టపడి చదివి ఉద్యోగం తెచ్చుకున్న భార్యకు జీవితాంతం మర్చిపోలేని అనుభవాన్ని మిగిల్చాడు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

పశ్చిమ బెంగాల్(West Bengal) రాష్ట్రం కేతుగ్రామ్(Ketugram) సబ్ డివిజన్ లో 25ఏళ్ల రేణుక అనే మహిళ నివసిస్తోంది. ఈమెకు పెళ్ళయ్యింది. ఈమె భర్త కిరాణా సరుకుల దుకాణం నడిపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. రేణుక మూడేళ్ళు కష్టపడి నర్స్ ట్రైనింగ్(Nurse training) పూర్తీ చేసి, పరీక్షలు రాస్తే.. ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగం వచ్చింది. భార్యకు ప్రభుత్వ ఉద్యోగం(Government job) వస్తే ఏ భర్తయినా సంతోషిస్తాడు. నా భార్యకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని అందరికీ గొప్పగా చెప్పుకుంటాడు. తమ కుటుంబ సమస్యలు చాలా వరకు తీరిపోతాయని అనుకుంటాడు. కానీ రేణుక భర్త మాత్రం పూర్తీగా అభద్రతా భావంలో(Insecurity feeling)కి జారిపోయాడు. తన భార్యకు ఉద్యోగం వస్తే తనను వదిలేస్తుందని అనుకున్నాడు. ఆమెను ఉద్యోగంలో చేరకుండా ఆపాలని ఇద్దరు స్నేహితులను తనతో కలుపుకుని పక్కా స్కెచ్ వేశాడు. ఆమె నిద్రిస్తున్న సమయం(sleeping time)లో ముఖం మీద దిండుతో అదిమిపెట్టి కత్తి తీసుకుని రేణుక కుడిచేతిని మోచేతి వరకు కోసేశాడు(chopped right hand). ఆ తరువాత ఆమె చేతిని ఇంట్లోనే దాటిపెట్టి ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్ళాడు. హాస్పిటల్ లో రేణుకకు స్పృహ వచ్చిన తరువాత ఆమె చాలా బాధపడింది. ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగం చేజారిపోతుందని కుమిలిపోయింది. ఇది గత ఏడాది జరిగిన సంఘటన.

Viral Video: ఈ రైతు తెలివి మామూలుగా లేదుగా.. పొలంలో ఉన్న ఈ ట్రాన్స్‌ఫార్మర్ పక్కన ఇదేంటో.. ఎందుకు పెట్టాడో తెలిస్తే..


అయితే ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీన రేణుకు ఒక ప్రైవేట్ హెల్త్ క్లినిక్ లో కృత్రిమ చేతిని(Artificial hand) అమర్చారు. ఇప్పుడామె కృత్రిమ చేత్తో రాయడం, ఇతర పనులు చేయడానికి అలవాటు పడుతోంది. ఇది మాత్రమే కాకుండా మళ్ళీ నర్స్ గా డ్యూటీ చేయడానికి సంసిద్దమవుతోంది. ఈమె గురించి తెలిసిన నెటిజన్లు 'ఇలాంటి భర్తలు కూడా ఉంటారా?' అని ఆశ్చర్యపోతున్నారు. 'ఆమె పట్టుదలే ఆమెను తిరిగి ఉద్యోగానికి సంసిద్దురాలిని చేసింది' అని ఆమె మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.

Onions: వామ్మో ఉల్లిపాయతో ఎన్ని లాభాలో అని సంబరపడ్డాం.. కానీ ఇన్ని ప్రమాదాలున్నాయని తెలిస్తే..


Updated Date - 2023-04-15T20:21:52+05:30 IST