UnstoppableShow: పవన్ కళ్యాణ్ పిస్టల్ తీసి ఎందుకు కాల్చుకోవాలి అనుకున్నాడు

ABN , First Publish Date - 2023-01-28T13:38:54+05:30 IST

అన్నయ్య రూమ్ లోకి వెళ్లి పిస్టల్ (Pistol) తో కాల్చుకుందామని అనుకున్నాను అని చెప్పాడు పవన్ కళ్యాణ్. ఎందుకు కాల్చుకుందాం అనుకున్నాడు?

UnstoppableShow: పవన్ కళ్యాణ్ పిస్టల్ తీసి ఎందుకు కాల్చుకోవాలి అనుకున్నాడు

అన్ స్టాపబుల్ లో (Unstoppable) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తరువాత అంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ఎపిసోడ్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో చేసినది. ఈ ఎపిసోడ్ త్వరలో ప్రసారం కానుంది, దానికి ముందుగా ఈ ఎపిసోడ్ లో కొన్ని హైలైట్స్ ఒక ప్రోమో లో విడుదల చేశారు. ఇందులో హోస్ట్ పవన్ కళ్యాణ్ ని 'భయ్యా ఈ పెళ్లిళ్ల గోల ఏంటి' (Pawan Kalyan's three marriages) అని అడుగుతాడు. అయితే అటు రాజకీయాల్లోనూ, బయటా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు అని చాలామంది అతన్ని టార్గెట్ చేశారు. అయితే ఈ షో లో పవన్ కళ్యాణ్ చేతే దానికి ఒక సమాధానం ఇప్పించే దిశగా ప్రయత్నాలు చేసారు.

PK-US1.jpg

అయితే పవన్ కళ్యాణ్ ఏమి సమాధానం చెప్పారు అన్నది చాల ఆసక్తికరం. అలాగే పవన్ కళ్యాణ్ తో పాటుగా సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) ని కూడా ఈ ఎపిసోడ్ లో పిలిచారు. ఇంక రామ్ చరణ్ (Ram Charan) ఎలా పవన్ కళ్యాణ్ ని దగ్గరయ్యాడు, ఎలా దగ్గరవాల్సి వచ్చింది అన్నది కూడా చెప్పడం ఆసక్తికరం. చివరగా అన్నయ్య రూమ్ లోకి వెళ్లి పిస్టల్ (Pistol) తో కాల్చుకుందామని అనుకున్నాను అని చెప్పాడు పవన్ కళ్యాణ్. ఎందుకు కాల్చుకుందాం అనుకున్నాడు? ఏమైంది? కెరీర్ పరంగా ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా? లేక జీవితంలో ఎదో సాధించాలని వచ్చి సినిమాలు చేస్తూ ఉండిపోయాను అనుకొనా, ప్రజారాజ్యం పార్టీ కి సంబంధించి ఏమైనా ఉందా? ఏంటి ఎందుకు ఆలా ప్రవర్తించాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్ అని అందరికి చాలా ఆసక్తికరంగా వుంది. ఏమైనా కూడా కొంచెం రాజకీయ ప్రత్యర్థులపై అలాగే పవన్ వ్యక్తిత్వం ఏంటి అన్నది బయట ప్రజలకి చెప్పడానికి ఈ ఎపిసోడ్ చాలా ఉపకరిస్తుంది అని పరిశ్రమలో ఒక టాక్ నడుస్తోంది.

Updated Date - 2023-01-28T13:52:37+05:30 IST