Share News

WhatsApp: ఇది కదా అసలు సిసలు అప్‌డేట్ అంటే.. వాట్సప్‌లో కొత్తగా వచ్చిన ఈ ఫీచర్ నిజంగా అదుర్స్..!

ABN , First Publish Date - 2023-10-31T15:37:20+05:30 IST

స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చాక ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌నకు విపరీతంగా ఆదరణ పెరిగింది. మెసేజ్‌లు, ఆడియో రికార్డింగ్‌లు, డాక్యుమెంట్లు, వీడియోలు సులభంగా పంపించుకునే వీలు ఉండడంతో అందరూ వాట్సాప్ వాడుతున్నారు.

WhatsApp: ఇది కదా అసలు సిసలు అప్‌డేట్ అంటే.. వాట్సప్‌లో కొత్తగా వచ్చిన ఈ ఫీచర్ నిజంగా అదుర్స్..!

స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చాక ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ (WhatsApp)కు విపరీతంగా ఆదరణ పెరిగింది. మెసేజ్‌లు, ఆడియో రికార్డింగ్‌లు, డాక్యుమెంట్లు, వీడియోలు సులభంగా పంపించుకునే వీలు ఉండడంతో అందరూ వాట్సాప్ వాడుతున్నారు. వాట్సాప్‌నకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని యాజమాన్యం కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌ను (WhatsApp new feature) అందిస్తోంది. తాజాగా వాట్సాప్ ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఐఫోన్ యూజర్స్ (iPhone Users) కోసం వాట్సాప్ ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏక కాలంలో 32 మందితో గ్రూప్ కాల్స్‌ (Group calls with 32 people) మాట్లాడుకునే వెసులుబాటును ఐఓఎస్ యూజర్స్ కోసం వాట్సాప్ తీసుకొచ్చింది. ఇంతకుముందు కేవలం 15 మందితో మాత్రమే గ్రూప్ కాల్స్ మాట్లాడే వీలుండేది. తాజా అప్‌డేట్‌తో ఆ సంఖ్య 32కు చేరుకుంది. ఈ ఫీచర్‌కు సంబంధించిన ఒక స్క్రీన్‌షాట్‌ను వాట్సాప్ బీటా ఇన్ఫో షేర్ చేసింది. కాల్ చేసే సమయంలో కాంటాక్ట్స్‌ను సెలక్ట్ చేస్తున్నప్పుడు, ``చూజ్‌ అప్ టు 31 పీపుల్`` అని కొత్త ఆప్షన్ కనిస్తోంది. అలాగే త్వరలో లాక్డ్ ఛాట్‌లను హైడ్ చేసుకునే వెసులుబాటును కూడా వాట్సాప్ తీసుకురాబోతోంది.

Viral Video: ఎలా వస్తాయయ్యా ఇలాంటి ఐడియాలు.. సైకిల్ సాయంతో డీజిల్ ఇంజిన్‌ను ఎలా స్టార్ట్ చేశారో మీరే చూడండి..!

ఈ కొత్త ఫీచర్‌ను ఎలా యాక్సెస్ చేసుకోవాలి..

1) వాట్సాప్ యాప్‌లో కాల్స్ ఓపెన్ చేయాలి. కొత్త కాల్ > కొత్త గ్రూప్ కాల్‌ ఆప్షన్‌పై ట్యాప్ చేయాలి.

2) కాల్‌కు యాడ్ చేయాలనుకుంటున్న కాంటాక్ట్స్ సెలక్ట్ చేసుకోవాలి. కాంటాక్ట్స్ సెర్చ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది.

3) అనంతరం వాయిస్ కాల్‌ (Voice call)పై ట్యాప్ చేయాలి.

Updated Date - 2023-10-31T15:37:20+05:30 IST