Weight Loss Tips: 30 రోజుల్లో బరువు తగ్గడం ఎలా..? అయిదంటే అయిదే టిప్స్.. నెల రోజుల తర్వాత చెక్ చేసుకుంటే..!

ABN , First Publish Date - 2023-09-27T13:29:35+05:30 IST

కేవలం ఈ అయిదు టిప్స్ ను 30రోజులు ఫాలో అయితే బరువు తగ్గడంలో మార్పు చూసి మీరే ఆశ్చర్యపోతారు.

Weight Loss Tips: 30 రోజుల్లో బరువు తగ్గడం ఎలా..? అయిదంటే అయిదే టిప్స్.. నెల రోజుల తర్వాత చెక్ చేసుకుంటే..!

ఆహారపు అలవాట్ల నుండి జీవనశైలి వరకు చాలా విషయాల వల్ల అధిక బరువు అనే సమస్య వస్తుంది. అయితే లావుగా ఉండటం ఎవ్వరికీ నచ్చదు. సన్నబడటానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ విచిత్రం ఏమిటంటే బరువు పెరిగినంత ఈజీగా బరువు తగ్గడం జరగదు. బరువు తగ్గడం అనేది చాలా కష్టంతో కూడుకున్నది అనే ఫీలింగ్ చాలామందిలో ఉంది. దీనికోసం డైటింగ్, వ్యాయామాలు, జిమ్ లో కసరత్తులు చేసి కూడా విఫలం అయ్యేవారు ఉన్నారు. అయితే అంత కష్టపడాల్సిన అవసరం లేదు. కేవలం అయిదు టిప్స్ ఫాలో అవ్వడం ద్వారా బరువు ఈజీగా తగ్గవచ్చు. 30రోజుల తరువాత బరువులో మార్పు చూసి తప్పకుండా ఆశ్చర్యపోతారు. అలాగని ఇవి శరీరానికి హాని కలిగించేవి కావు. ఆరోగ్యకరమైన రీతిలో ఈజీగా బరువు తగ్గించే ఆ అయిదు టిప్స్(easy weight loss tips) ఏంటో తెలుసుకుంటే..

ప్రోటీన్ బాగా తినాలి..(protein food)

బరువు తగ్గడానికి ప్రోటీన్ బాగా తీసుకోవాలి. ప్రోటీన్స్ లో పోషకాలు సమృద్దిగా ఉంటాయి. ఇది బరువు తగ్గడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే శరీరం వాటిని జీర్ణం చేయడానికి చాలా కేలరీలను బర్న్ చేస్తుంది. అధిక ప్రోటీన్ ఆహారం రోజుకు 80-100 కేలరీలు బర్న్ అయ్యేలా చేస్తుంది. ప్రోటీన్ ఆహారం ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది, ఆకలిని నియంత్రణలో ఉంచుతుంది. అధిక ప్రోటీన్ ఆహారం తీసుకోవడం వల్ల రోజుకు 400 కేలరీలు తక్కువగా తీసుకుంటారని కొన్ని అధ్యయనాల్లో తేలింది.

Health Tips: టమోటాలను తింటే వచ్చే లాభాలేంటి..? గర్భంతో ఉన్న వాళ్లు అసలు టమోటాలను తినొచ్చా లేదా అంటే..!



ఫాస్ట్ ఫుడ్.. ప్రాసెస్ చేసిన ఆహారం వదిలెయ్యాలి..(avoid fast food, processed food )

ప్రాసెస్ చేసిన ఆహారంలో ఎక్కువ చక్కెర, కొవ్వులు, కేలరీలు ఉంటాయి. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రాసెస్ చేసిన ఆహారం వ్యసనంగా మారుతుంది. దీన్ని తినడం మొదలుపెడితే ఇంకా ఎక్కువ తినేలా శరీరంలో ఆకలి వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. తత్ఫలితంగా స్థూలకాయానికి దారితీస్తుంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఆహారం తయారీ కోసం ఉపయోగించే నూనెలు, బటర్, పిండి అన్నీ అనారోగ్యకరమైనవే.. వీటిని తింటే బరువు పెరుగుతారు.

ఆరోగ్యకరమైన చిరుతిండ్లు.. (Healthy snacks)

ఒక పెద్ద నిజం ఏమిటంటే బరువు పెరగడానికి ప్రధాన కారణం అనారోగ్యకరమైన చిరుతిండ్లు. ఆకలి అనిపించగానే బయటినుండి చిరుతిండ్లు తెచ్చుకుని తింటుంటారు. వీటిని మానేస్తే బరువు తగ్గడం సులభం. ఆకలి అనిపించినప్పుడు బయటి ఆహారాల మీద ఆధారపడకుండా ఇంట్లోనే ఆరోగ్యమైన చిరుతిండ్లు తీసుకోవాలి. పెరుగు, డ్రై ఫ్రూట్స్, క్యారెట్లు, ఉడికించిన గుడ్లు , పోహా, మరమరాలు, ఫూల్ మఖనా, వేరుశనగ గింజలు.. ఇలాంటి ప్రోటీన్ బాగా ఉన్న స్నాక్స్ అటు ఆకలిని తీర్చి ఇటు ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి.

ఉప్పు, చక్కెర తగ్గించాలి.. (avoid salt and sugar)

చక్కెర, ఉప్పు ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధులు చాలా తొందరగా వస్తాయి. చక్కెర ఎక్కువ ఉన్న ఆహారాలు తీసుకుంటే అదనపు కేలరీలు శరీరంలోకి వెళతాయి. అధిక ఉప్పు తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం కంటెంట్ పెరుగుతుంది. తద్వారా బరువు పెరుగుతారు.

ఉపవాసం చేయాలి.. (fasting)

అడపాదడపా ఉపవాసం చేయడం వల్ల ఆహార చక్రాన్ని నియంత్రణో ఉంచుకోవచ్చు. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. కేలరీల వినియోగం లోనూ, బరువు నియంత్రణలోనూ ఉపవాసం ఉపయోగకరంగా ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం ఉపవాసం చాలా ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయి.

Health Tips: అమ్మ బాబోయ్.. ఇన్ని అనారోగ్య సమస్యలు వస్తాయా..? ఈ 4 కూరగాయలను పచ్చిగానే తింటే..!


Updated Date - 2023-09-27T13:29:35+05:30 IST