Viral Video: ఛీ.. ఛీ.. దాని కోసం ఇంతలా కొట్టుకుంటారా? పెళ్లి వేడుకలో బంధువులు ఎందుకు గొడవపడ్డారో తెలిస్తే..
ABN , Publish Date - Dec 22 , 2023 | 03:33 PM
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. పెళ్లి అంటే బంధువులు, స్నేహితులు, విందులు, వినోదాలు.. అందరూ ఎంతో కోలాహలంగా తిరుగుతూ పెళ్లిని సందడిగా మారుస్తారు. అయితే కొన్ని సార్లు చాలా చిన్న విషయానికి అనుకోని గొడవలు కూడా తలెత్తుతాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల (Wedding) సీజన్ నడుస్తోంది. పెళ్లి అంటే బంధువులు, స్నేహితులు, విందులు, వినోదాలు.. అందరూ ఎంతో కోలాహలంగా తిరుగుతూ పెళ్లిని సందడిగా మారుస్తారు. అయితే కొన్ని సార్లు చాలా చిన్న విషయానికి అనుకోని గొడవలు కూడా తలెత్తుతాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video) చూస్తే షాక్ అవక తప్పదు. ఎందుకంటే కేవలం పన్నీర్ (Paneer) కోసం పెళ్లికి హాజరైన బంధుమిత్రులు ఒకరినొకరు చితక్కొట్టుకున్నారు. ఆ వీడియో చాలా మందికి షాక్ కలిగిస్తోంది (Fight for Paneer).
@gharkekalesh అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో కొందరు వ్యక్తులు పెళ్లి విందులో కొట్టుకుంటున్నారు. ఒకరినొకరు తోసుకుంటూ, ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకుంటూ పెళ్లి వేడుకను రణరంగంగా మార్చేశారు. పెళ్లి విందులో పెట్టిన మటర్ పన్నీర్ కర్రీలో (Matar Paneer dish) పన్నీర్ రాలేదనే కారణంతో ఈ గొడవ జరిగిందని వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి కామెంట్ చేశాడు. ఈ వీడియో చాలా మంది ఆశ్చర్యపోయారు (Funny Video).
Viral: ఒకే రోజు వేర్వేరు విమానాల్లో ప్రయాణిస్తున్న దంపతులకు షాకింగ్ అనుభవం.. అసలేం జరిగిందంటే..
ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోను ఇప్పటివరకు 2.1 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ``పన్నీర్ లేకపోతే పెళ్లి జరగదు``, ``పన్నీర్ కోసం మూడో ప్రపంచ యుద్ధం వచ్చేలా ఉంది``, ``పన్నీర్‌ను వాళ్లు చాలా సీరియస్‌గా తీసుకున్నారు``, ``ఇది బీహార్‌లో జరిగి ఉంటుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.