Shocking Video: అంటార్కిటికాలో షాకింగ్ దృశ్యం.. గ్లాస్‌లో బీర్ వేసేటపుడు ఏం జరిగిందో చూడండి..
ABN , Publish Date - Dec 23 , 2023 | 09:13 PM
చలికాలం వచ్చిందంటే చాలు మనలో చాలా మంది స్వెట్టర్లు వేసుకుని, చలి మంటలు వెలిగించుకుని కూర్చుంటారు. ఉష్ణోగ్రతలు పడిపోతే చలికి గజగజ వణుకుతారు. అయితే ఈ భూమి మీద కొన్ని ప్రాంతాలు ఎప్పుడూ దట్టమైన మంచుతో నిండి ఉంటాయి.
చలికాలం (Winter) వచ్చిందంటే చాలు మనలో చాలా మంది స్వెట్టర్లు వేసుకుని, చలి మంటలు వెలిగించుకుని కూర్చుంటారు. ఉష్ణోగ్రతలు పడిపోతే చలికి (Cold) గజగజ వణుకుతారు. అయితే ఈ భూమి మీద కొన్ని ప్రాంతాలు ఎప్పుడూ దట్టమైన మంచుతో నిండి ఉంటాయి. దక్షిణ ధ్రువం (South Pole) దగ్గర ఉన్న అంటార్కిటాలో (Antarctica) పరిస్థితిని కళ్లకు కడుతున్నట్టు ఉన్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video). అక్కడ ప్రస్తుతం -64 డిగ్రీల వాతావరణం ఉంది.
thejeffcapps అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన ఓ వీడియో చాలా మందికి షాక్ కలిగిస్తోంది. -64 డిగ్రీల చలిలో తిరుగుతున్న జెఫ్.. క్యాన్ నుంచి బీర్ (Beer)ను గ్లాసులో వేసుకోవడానికి ప్రయత్నించాడు. ఆ సెకెండ్ల వ్యవధిలోనే బీరు గడ్డకట్టేసింది. గ్లాస్, బీర్, క్యాన్ ఒకదానికొకటి అతుక్కుపోయి ఉండిపోయాయి. అతడు మంచు కురుస్తుండగా అంటార్కిటికాలో తిరుగతూ అక్కడి పరిస్థితిని వీడియో తీశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియోను ఇప్పటివరకు 20 లక్షల మందికి పైగా వీక్షించారు.
ఆ షాకింగ్ వీడియోను 1.65 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``అక్కడ ఎంత సమయం బయట తిరగగలరు``, ``అలాంటి ప్రాంతాల్లోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వకూడదు``, ``చాలా అసాధారణం``, ``వామ్మో.. బీరు గడ్డకట్టుకుపోయింది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.