Viral news: అతనో రోజు కూలీ.. రాత్రి నిద్రపోయే ముందు అకౌంట్‌లో 17 రూపాయలే... తెల్లారేసరికి రూ.100 కోట్లు... భోరున విలపిస్తున్న కుటుంబ సభ్యులు.. ఎందుకంటే..

ABN , First Publish Date - 2023-05-25T22:23:14+05:30 IST

అకౌంట్‌లో పొరపాటున రూ.100 పడితేనే చాలామంది మురిసిపోతుంటారు. మరి తెల్లారేసరికి ఖాతాలో రూ.100 కోట్లు పడితే!!.. నిజజీవితంలో ఇలాంటివి ఎందుకు జరుగుతాయిలే.. ఏదో కల వరకైతే ఓకే అని అనుకుంటున్నారా?. కానీ పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ రోజు కూలీకి కల లాంటి నిజం అనుభవపూర్వకంగా ఎదురైంది.

Viral news: అతనో రోజు కూలీ.. రాత్రి నిద్రపోయే ముందు అకౌంట్‌లో 17 రూపాయలే... తెల్లారేసరికి రూ.100 కోట్లు... భోరున విలపిస్తున్న కుటుంబ సభ్యులు.. ఎందుకంటే..

అకౌంట్‌లో పొరపాటున రూ.100 పడితేనే చాలామంది మురిసిపోతుంటారు. మరి తెల్లారేసరికి ఖాతాలో రూ.100 కోట్లు పడితే!!.. నిజజీవితంలో ఇలాంటివి ఎందుకు జరుగుతాయిలే.. ఏదో కల వరకైతే ఓకే అని అనుకుంటున్నారా?. కానీ పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ రోజు కూలీకి కల లాంటి నిజం అనుభవపూర్వకంగా ఎదురైంది. మహ్మద్ నసీరుల్లా మండల్ అనే వ్యక్తి రాత్రికి రాత్రే రూ.100 కోట్లకు అధిపతయ్యాడు. పడుకునే ముందు అకౌంట్‌లో కేవలం రూ.17 మాత్రమే ఉండగా తెల్లారేసరికి రూ.100 కోట్లు వచ్చిపడ్డాయి. ఎలా పసిగట్టారో ఏమోగానీ దేగన సైబల్ సెల్ డిపార్ట్‌మెంట్ అధికారులు మండల్ ఇంటికెళ్లి నోటీసులు ఇచ్చారు. అధికారులు వచ్చి నోటీసులు ఇచ్చే వరకు అకౌంట్‌లో వంద కోట్లు ఉన్నాయనే విషయం అతడికి తెలియదు. మే 30న విచారణకు రావాలని అధికారులు కోరారు. ఒక్కసారిగా ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎలా వచ్చిందో వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసుల్లో స్పష్టం చేశారు. దీంతో రూ.100 కోట్లు పడ్డాయనే సంతోషం కూసింత కూడా లేకపోగా విచారణలో ఏం చెప్పాలో తెలియక కలవరపడుతున్నాడు.

అనూహ్యమైన ఈ పరిణామంపై నసీరుల్లా మండల్ తీవ్రంగా ఆందోళన చెందుతున్నాడు. ‘‘ పోలీసుల నుంచి కాల్ వచ్చిన నాటి నుంచి నాకు నిద్ర పట్టడం లేదు. ఏం చెయ్యాలో నాకు తెలియదు. నా బ్యాంక్ అకౌంట్‌లో రూ.100 కోట్లు ఉన్నాయి. మొదటిసారి నమ్మలేకపోయాను. కానీ మళ్లీ మళ్లీ చెక్ చేసుకున్న తర్వాత గానీ అవి రూ.100 కోట్లని నమ్మలేకపోయాను’’ అని మండల్ గుర్తుచేసుకున్నాడు. గూగుల్ పే‌లో చెక్ చేసుకుంటే ఏడు అంకెల సంఖ్యలో డబ్బు ఉందని, ఇంత పెద్ద మొత్తంలో డబ్బు తన ఖాతాలోకి ఎలా వచ్చిందో తెలుసుకునేందుకు తన అకౌంట్ ఉన్న పీఎన్‌బీ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాననని వివరించాడు.

‘‘ ఇంత పెద్దమొత్తంలో డబ్బు నా ఖాతాలో ఎలా వచ్చిపడిందో నేను చెప్పలేను. నేను రోజు కూలీగా పనిచేసుకుంటున్నాను. ఏదైనా కేసు పెడతారా లేక పోలీసులు కొడతారా అన్న భయంతోనే బతుకుతున్నాను. ఇంట్లో వాళ్లంతా ఏడుస్తున్నారు’’ అని మండల్ తన బాధను వివరించాడు. పాస్‌బుక్ తీసుకుని బ్యాంక్‌కు వెళ్తే రూ.100 కోట్లు పడడానికి ముందు కేవలం రూ.17 మాత్రమే ఉన్నాయని చెప్పారని తెలిపాడు. బ్యాంక్ అధికారులు తన ఖాతాను బ్లాక్ చేశారని, కేసు నమోదవ్వడంతో ఇంతకుమించి వివరాలు ఇవ్వలేమని బ్యాంక్ వాళ్లు చెబుతున్నారని వాపోయాడు. ఈ డబ్బు ఎవరిదైతే వాళ్లు తీసుకోవచ్చునని, ఇంత డబ్బుతో తానేం చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా నసీరుల్లా మండల్‌ ముర్షిదాబాద్‌లోని బసుడెబ్‌పుర్ గ్రామానికి చెందిన వ్యక్తి. రోజు కూలీగా కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రూ.100 కోట్లు ఖాతాలో పడ్డ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

Updated Date - 2023-05-25T22:23:14+05:30 IST