Viral: ఆమె అమ్మాయేనని తోడబుట్టిన వాళ్లకూ తెలియదు.. 38 ఏళ్ల తర్వాత అసలు నిజాన్ని బయటపెట్టడంతో..!

ABN , First Publish Date - 2023-08-28T17:17:42+05:30 IST

తను ఆడపిల్లను అనే విషయం తన ఇరుగు పొరుగు వారికి తనతో ఉద్యోగం చేసేవారికే కాదు, ఇంట్లో తోడ బుట్టిన తమ్ముడు, చెల్లెళ్ళకు కూడా తెలియనివ్వలేదు. 38ఏళ్ళ పాటు అచ్చం అబ్బాయిలా బ్రతికింది. ఇంకా చెప్పాలంటే ఆ ఇంటికి పెద్ద కొడుకైంది.

Viral: ఆమె అమ్మాయేనని తోడబుట్టిన వాళ్లకూ తెలియదు.. 38 ఏళ్ల తర్వాత అసలు నిజాన్ని బయటపెట్టడంతో..!

ఇప్పట్లో ఆడపిల్లలు మగవాళ్లలా ప్యాంటు, చొక్కాలు వేసుకుంటున్నారు, అబ్బాయిలతో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ పూర్తీగా అబ్బాయిల రూపురేఖలతో కనిపించడం మాత్రం జరగదు. అలా కనిపించడానికి ప్రయత్నించినా అమ్మాయిల శరీర సౌష్టవం వారిలో ప్రత్యేకతను ఇట్టే బయటపెడుతుంటుంది. కానీ ఓ మహిళ మాత్రం 38ఏళ్ళ పాటు తాను ఆడపిల్లను అనే విషయం తన ఇరుగు పొరుగు వారికి తనతో ఉద్యోగం చేసేవారికే తెలియనివ్వలేదు. కేవలం వీళ్ళకే కాదు ఇంట్లో తోడ బుట్టిన తమ్ముడు, చెల్లెళ్ళకు కూడా తెలియనివ్వలేదు. 38ఏళ్ళ పాటు అచ్చం అబ్బాయిలా బ్రతికింది. ఇంకా చెప్పాలంటే ఆ ఇంటికి పెద్ద కొడుకైంది. యావత్ భారతదేశాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్న ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

మహారాష్ట్ర(Maharashtra) రాష్ట్రం వాశిమ్(Washim) జిల్లాలో విస్తుపోయే నిజం బయటపడింది. ఇక్కడ సాగర్ చంబోల్కర్ అనే ఓ వ్యక్తి నివసిస్తున్నాడు. ఇన్నాళ్లు అతడు మగాడే అని అతని చుట్టుప్రక్కల వారినుండి ఇంట్లో తోడబుట్టిన వారు కూడా భావించారు. కానీ సాగర్ అబ్బాయి కాదని అమ్మాయని తేలింది. 1985లో ఈమె జన్మించింది. కుటుంబానికి మొదటి సంతానం కావడంతో ఆమెను తల్లిదండ్రులు, అవ్వతాతలు అబ్బాయిలా పెంచారు(Women grow up like a boy). ఈమె అమ్మాయనే విషయం కేవలం అమ్మనాన్నలు, అవ్వతాతలకే తెలుసు. దానికి అనుగుణంగానే ఆమె అబ్బాయిల దుస్తులు ధరించేది. కానీ పాఠశాలకు వెళ్లడం మొదలుపెట్టిన తరువాత ఆమెకు ఇబ్బందిగా మారింది. అమ్మాయిలతో పాటు ఫ్రాక్ వేసుకోవడం చాలా అసౌకర్యంగా అనిపించింది. దీంతో స్కూలుకు వెళ్లడమే మానుకుంది. ఓపెన్ స్కూల్ లో 10వ తరగతి పూర్తీ చేసింది.

Woman: ఎంత పని చేశావమ్మా..? కాసేపట్లో నీ దగ్గరకు వస్తానమ్మా అంటూ కూతురికి ఆ తండ్రి ఫోన్ చేసిన రోజే..!



చిన్నప్పటి నుండి అబ్బాయిలానే పెరుగుతూ వచ్చిన ఆమె సాగర్ అనే పేరుతోనే తన జీవితాన్ని కొనసాగించింది. 10వ తరగతి తరువాత తన జీవితాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) కు అంకితం చేసింది. దీని ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనేది. ఈమెకు పెళ్లి వయసు రావడంతో తల్లిదండ్రులు పెళ్ళి చేసుకోమని చెప్పారు.ఈమె ఒప్పుకోకపోవడంతో కౌన్సెలింగ్ కూడా ఇప్పించారు. కానీ ఈమెను మార్చడం కౌన్సెలర్ ల వల్ల కూడా కాలేదు. అబ్బాయిల్లా వివిధ కోర్సులు నేర్చుకుని కంప్యూటర్ రిపేరింగ్, ఇన్సాలేషన్ షాపులలో పనిచేసేది. తన గొంతును బట్టి అమ్మాయని ఎవరూ గుర్తుపట్టకుండా ఉండటం కోసం హార్మోన్ థెరపీ కూడా తీసుకుంది.

ఆర్ఎస్ఎస్ లో సీనియర్ కార్యకర్తలుగా ఉన్న కొందరికి సాగర్ అబ్బాయి కాదని అమ్మాయని తెలిసింది. వారు ఆమెను తిరిగి ఆడపిల్లగా మారి సంతోషంగా బ్రతకమని సలహా ఇచ్చారు. తను చేయాలనుకునే పని ఏదైనా ఆడపిల్లగా ఉంటూ చేయవచ్చని వారు ఆమెకు నచ్చజెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు కొన్ని ఆచారాలు నిర్వహించి ఆమెను అమ్మాయిలా అలంకరించారు. ఆమెకు సంగరా అనే పేరు పెట్టారు. సంగరా అంటే యోధుడు అనే అర్థం వస్తుందని అంటున్నారు. ఈమె గురించి నిజం తెలిసిన తరువాత ఆమెతో పనిచేసిన యువకులు, ఆమె తమ్ముడు కూడా ఆశ్చర్యపోయారు. సంగరా తన ఇంట్లో ఒక్కతే ప్రత్యేక గదిలో ఉంటుందని, దీనివల్లే విషయం బయటకు తెలియలేదని ఆమె తమ్ముడు అన్నాడు. ఇప్పుడు సంగరా ఆడపిల్లగా మారిపోయినంత మాత్రానా ఆర్ఎస్ఎస్ ను వదిలేది లేదని విశ్వమాంగల్య మెడికల్ మిషన్ తో కలిసి పనిచేస్తూ దేశానికి సేవ చేస్తానని చెప్పుకొచ్చింది.

Viral: ఒకే ఒక్క ఫోన్‌కాల్‌తో.. ఓ మాజీ ప్రభుత్వ ఉద్యోగికి ఊహించని షాక్.. రిటైర్మెంట్ తీసుకుని హ్యాపీగా ఇంట్లో ఉంటోంటే..!


Updated Date - 2023-08-28T17:17:42+05:30 IST