Viral: ఒకే ఒక్క ఫోన్‌కాల్‌తో.. ఓ మాజీ ప్రభుత్వ ఉద్యోగికి ఊహించని షాక్.. రిటైర్మెంట్ తీసుకుని హ్యాపీగా ఇంట్లో ఉంటోంటే..!

ABN , First Publish Date - 2023-08-28T15:53:32+05:30 IST

రిటైర్మెంట్ తరువాత హాయిగా విశ్రాంత జీవనం గుడుపుతున్న ఓ వ్యక్తి జీవితంలో ఒకే ఒక్క ఫోన్ కాల్ ఊహించని దెబ్బ కొట్టింది

Viral: ఒకే ఒక్క ఫోన్‌కాల్‌తో.. ఓ మాజీ ప్రభుత్వ ఉద్యోగికి ఊహించని షాక్.. రిటైర్మెంట్ తీసుకుని హ్యాపీగా ఇంట్లో ఉంటోంటే..!

భారతదేశంలో రిటైర్ అయిన అధికారులు వారికి వచ్చే పెన్షన్ తో హాయిగా జీవితపు బండి లాగేస్తుంటారు. రిటైర్మెంట్ అంటే హాయిగా విశ్రాంతి తీసుకోవడమే. ఓ ప్రభుత్వ అధికారి తన సర్వీస్ చేసినంత కాలం తన పిల్లలను చదివించి, వారిని ప్రయోజకులను చేసి, వారికి పెళ్ళిళ్ళు చేసి తన బాధ్యతన నిర్వర్తించాడు. రిటైర్మెంట్ తరువాత హాయిగా విశ్రాంత జీవనం గుడుపుతున్నాడు. కానీ ఆయనకు వచ్చిన ఒకే ఒక్క ఫోన్ కాల్ ఆయన జీవితాన్ని పెద్ద కుదుపుకు గురిచేసింది. ఈయనకు ఎదురైన అనుభవం గురించి విన్న పలువురు ఆశ్చర్యపోతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాలు తెలుసుకుంటే..

ఢిల్లీకి(Delhi) చెందిన ఓ వ్యక్తి ప్రభుత్వ సంస్థలో పనిచేసి రిటైర్మెంట్ తీసుకున్నాడు(retire government officer). ప్రస్తుతం ఆయన వయసు 68సంవత్సరాలు. ఒకరోజు ఆయనకు తెలియని నెంబర్ నుండి వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. కొత్త నెంబర్ నుండి కాల్ వస్తుండటంతో అతను కొన్ని సెకెన్లు తటపటాయించినా తెలిసినవారే చేసుంటారనే ధీమాతో కాల్ లిఫ్ట్ చేశాడు. కాల్ లిఫ్ట్ కాగానే అవతలివైపు అర్థనగ్నంగా ఉన్న ఒక మహిళ కనిపించింది. ఆమె కొన్ని సెకెన్లు కూడా ఆలస్యం చేయకుండా కనీసం ఒక్క మాట మాట్లాడకుండా తన ఒంటిమీద మిగిలిన దుస్తులను విప్పడం మొదలెట్టింది. అది చూడగానే ఆ రిటైర్ ఆఫీసర్ భయపడిపోయాడు. వెంటనే వీడియో కాల్ డిస్కనెక్ట్ చేశాడు. ఇది జరిగిన మరుసటిరోజు ఓ వ్యక్తి రిటైర్ ఆఫీసర్ ఇంటికి వెళ్లాడు. తాను సైబర్ క్రైమ్ బ్రాంచ్ డిసిపి అని చెప్పాడు. ఓ మహిళను అరెస్ట్ చేశామని ,ఆమెను కోర్టులో హాజరుపరచాల్సి ఉందని , ఆమె కాల్ లిస్ట్ లో మీరు ఉన్నారు కాబట్టి మీరు విచారణ సమయంలో కోర్టుకు రావాలని ఆ వ్యక్తి చెప్పాడు. ఆ మాటలు వినగానే ఆ రిటైర్ ఆఫీసర్ గుండెలో రాయి పడినట్టు అయ్యింది.

Viral Video: మొన్న క్యాబ్ డ్రైవర్‌తోనూ.. నేడు బ్యూటీ పార్లర్‌లోనూ.. సేమ్ సీన్ ను రిపీట్ చేసిన మహిళ..!రిటైర్ ఆఫీసర్ వెంటనే డిసిపితో ఆ మహిళకు తనకు సంబంధం లేదని చెప్పాడు. కానీ ఆ డిసిపి మాత్రం ఆ మహిళ వాట్సప్ వీడియో రికార్డ్స్ ను యూట్యూబ్ లో అప్లోడ్ చేయించానని చెప్పినట్టు చెప్పాడు. ఆ వీడియోలు తొలగించడానికి డబ్బు డిమాండ్ చేసిందని కూడా చెప్పాడు. డబ్బు ఇవ్వడం తప్ప దీనికి వేరే దారిలేదు, పరువు పోతుందని చెప్పాడు. చేసేది లేక ఆ రిటైర్ ఆపీసర్ సదరు వ్యక్తికి 20వేల రూపాయలు సమర్పించుకున్నాడు. నగదు చెల్లింపుకు సంబంధించి రశీదు ఇవ్వమని ఆయన డిసిపిని అడిగాడు. ఆ రశీదు కావాలంటే మళ్లీ 41వేలు కట్టాలని చెప్పడంతో రెండవసారి 41వేలు కట్టాడు. ఇదంతా ముగిసిన తరువాత అది 'సెక్స్ టార్షన్'(Sextortion) కు సంబందించిన మోసం అని బయటపడింది. మహిళలతో చేతులు కలిపిన కొందరు వీడియో కాల్స్ చేయించి తరువాత వారే బాధితుల దగ్గకు వెళ్లి సైబర్ క్రైమ్ పేరుతో డబ్బు గుంజుతున్నట్టు తెలిసింది. ఈ పని చేసే స్కామర్లు దాదాపు 2లక్షల నుండి 40లక్షల వరకు లాగే అవకాశాలు బోలెడు ఉన్నాయట. బాధితులలో ఎక్కువమంది బాగా చదువుకున్నవారే కావడం గమనార్హం.

Woman: ఎంత పని చేశావమ్మా..? కాసేపట్లో నీ దగ్గరకు వస్తానమ్మా అంటూ కూతురికి ఆ తండ్రి ఫోన్ చేసిన రోజే..!


Updated Date - 2023-08-28T16:00:24+05:30 IST