Viral Video: మొన్న క్యాబ్ డ్రైవర్‌తోనూ.. నేడు బ్యూటీ పార్లర్‌లోనూ.. సేమ్ సీన్ ను రిపీట్ చేసిన మహిళ..!

ABN , First Publish Date - 2023-08-28T10:30:18+05:30 IST

ఓ మహిళ వింత ప్రవర్తన నెట్టింట్లో వైరల్ గా మారింది. నచ్చినచోట నచ్చిన సేవలు పొందిన తరువాత దర్జాగా వెళ్ళిపోతోంది. ఈమె గురించి విన్న నెటిజన్లు ఈమె మీద మండిపడుతున్నారు. ఇదేం పనమ్మా తల్లీ.. నీకు ఇదేం పాడు బుద్ది అని తిట్టిపోస్తున్నారు.

Viral Video: మొన్న క్యాబ్ డ్రైవర్‌తోనూ.. నేడు బ్యూటీ పార్లర్‌లోనూ.. సేమ్ సీన్ ను రిపీట్ చేసిన మహిళ..!

ఇంట్లో నుండి అడుగు బయట పెడితే చాలు ప్రయాణించాలన్నా, ఎక్కడైనా ఏదైనా తినాలన్నా అవసరమైన సేవలు పొందలన్నా డబ్బు చెల్లించాల్సిందే. కానీ ఓ మహిళ మాత్రం వింతగా ప్రవర్తిస్తోంది. నచ్చినచోట నచ్చిన సేవలు పొందిన తరువాత దర్జాగా వెళ్ళిపోతోంది. ఈమె గురించి విన్న నెటిజన్లు ఈమె మీద మండిపడుతున్నారు. 'ఇదేం పనమ్మా తల్లీ.. నీకు ఇదేం పాడు బుద్ది' అని తిట్టిపోస్తున్నారు. ఈ మహిళ ఎవరు? ఈమె ఎందుకు ఇలా చేస్తోంది? అసలు ఈమె కథేంటి? పూర్తీగా తెలుసుకుంటే..

హర్యానా(Haryana) రాష్ట్రం గురుగ్రామ్(Gurgaon) లో ఓ మహిళ వింత ప్రవర్తన అందరినీ తెగ ఇబ్బంది పెడుతోంది. జ్యోతి దలాల్ అనే పేరు గల మహిళ గతనెలలో గురుగ్రామ్ లోని మిలీనియం సిటీ సెంటర్ దగ్గర ఒక క్యాబ్ డ్రైవర్ తో గొడవపడుతూ కనిపించింది. 'ఆమె అలా ఎందుకు గొడవ పడుతోంది? క్యాబ్ డ్రైవర్ ఏమైనా తప్పుగా ప్రవర్తించాడా?' అని దగ్గరకు వెళ్లి విచారించిన వారికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆమె దాదావు 12గంటల సేపు క్యాబ్ లో ప్రయాణించింది. ప్రయాణం ముగిసిన తరువాత క్యాబ్ డ్రైవర్ కు రూ.2వేలు చెల్లించాల్సి ఉండగా ఆమె చెల్లించలేదు(women reject 2000rupees to pay cab driver). పైపెచ్చు డబ్బు గురించి గొడవ చేస్తే వేధింపుల కేసు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. ఒక్కరూపాయి కూడా చెల్లించకుండా వెళ్ళిపోయింది. ఈ సంఘటన జరిగి నెల తిరగకముందే మళ్లీ సేమ్ సీన్ రిపీట్ చేసిందీమె. గురుగ్రామ్ లో ఉన్న గ్రేస్ అండ్ గ్లామల్ బ్యూటీ సెలూన్(grace and glamour) కు వెళ్లింది. మద్యాహ్నం అనగా వెళ్లి రాత్రి వరకు వివిధ రకాల బ్యూటీ ట్రీట్మెంట్లు చేయించుకుంది. బ్యూటీ ట్రీట్మెంట్ కు ముందే డబ్బు గురించి బ్యూటీ సెలూన్ లో అడగ్గా రాత్రి 11గంటల లోపు డబ్బు చెల్లించే వెళతానని వారికి మాట ఇచ్చింది. దీంతో వారు ఆమె అడిగిన అన్నిరకాల బ్యూటీ ట్రీట్మెంట్లు ఇచ్చారు. దీనికి మొత్తం అక్షరాలా 20వేల రూపాయల బిల్ అయ్యింది. అంతా అయ్యాక ఆమె ప్లేటు ఫిరాయించింది. నేను డబ్బు ఇవ్వనని సింపుల్ గా చెప్పేసింది(women reject 20k to pay in beauty saloon). దీంతో బ్యూటీ సెలూన్ లో పనిచేసేవారు పోలీసులను ఆశ్రయించారు. కానీ పోలీసుల నుండి ఎలాంటి సహాయం లభించలేదట. ఈమె పలుకుబడి కలి9ిన ఓ వ్యక్తికి స్నేహితురాలనే విషయం తెలిసి పోలీసులు ఆమె జోలికి వెళ్ళడం లేదంటున్నారు. జ్యోతి దలాల్ గత నెలలో క్యాబ్ డ్రైవర్ దగ్గర ప్రవర్తించిన తీరు, ఇప్పుడు బ్యూటీ పార్లర్ లో ప్రవర్తించిన విధానం ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అవుతోంది.

Health Tips: ఈ పండు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే కొనేయండి.. ఇంతగా ఎందుకు చెప్పాల్సివస్తోందంటే..



ఈ వీడియోను Deepika Narayan Bharadwaj అనే ట్విట్టర్ ఎక్స్(Twitter X) అకౌంట్ నుండి షేర్ చేశారు. 'జ్యోతి దలాల్ మళ్ళీ అదే పని చేసింది, బ్యూటీ పార్లర్ లో ఏకంగా 20వేలు చెల్లించడానకి నిరాకరించింది. గురుగ్రామ్ పోలీసులు ఈ సంఘటనపై ఎలాంటి చర్యా తీసుకోలేదు' అంటూ క్యాప్షన్ మెన్షన్ చేశారు. 'మహిళా సాధికారత గురించి మాట్లాడే మహిళా సంఘాలు ఈమె చేస్తున్న పనిని ఓసారి గమనించాలి' అంటూ ఒకరు కామెంట్ చేశారు. 'సెలూన్ లో పనిచేసే కుర్రాళ్లు ఆమెకు గుండు కొట్టాలి' అని మరొకరు కామెంట్ చేశారు. 'ఆమెను తీసుకెళ్ళి శాశ్వతంగా జైల్లో వేయండి ' అని ఇంకొందరు అంటున్నారు. హర్యానా రాష్ట్రంలో మాత్రమే కాకుండా దేశం అంతా ఈ వీడియో వైరల్ అవుతోంది.

Long Hair: మెడిసిన్సూ అక్కర్లేదు, హెయిర్ ప్యాక్ లు వద్దు.. రోజూ ఇవి తాగండి.. జుట్టు పెరుగుదల చూసి మీరే ఆశ్చర్యపోతారు!!


Updated Date - 2023-08-28T10:30:18+05:30 IST