Viral Video: బాసూ.. నువ్వు సూపరు.. రెండు చేతులూ లేకున్నా సరే.. ఇతడి టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా..!

ABN , First Publish Date - 2023-03-10T19:10:33+05:30 IST

చేతులు లేకపోతేనేం.. అతనిలో సంకల్ప శక్తి అతన్ని ప్రత్యేకంగా నిలబెడుతోంది.

Viral Video: బాసూ.. నువ్వు సూపరు.. రెండు చేతులూ లేకున్నా సరే.. ఇతడి టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా..!

ప్రతి మనిషి జీవితంలో సమస్యలు ఉంటాయి. కొందరు సమస్యలను చూసి బెంబేలెత్తిపోతారు, మరికొందరు సమస్యతో తలపడి చావోరేవో తేల్చుకోవాలని అనుకుంటారు. అలాంటి పోరాట స్వభావం కలిగిన వ్యక్తే మహీంద్ర కూడా.. అన్ని అవయవాలు సరిగ్గా ఉండి ఏమీ చేయలేక చేతకానివాళ్ళుగా మిగిలిపోయే వాళ్ళకు ఇతనొక గొప్ప ప్రేరణ. చేతులు లేకపోతేనేం.. అతనిలో సంకల్ప శక్తి అతన్ని ప్రత్యేకంగా నిలబెడుతోంది. ఇతనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇతని గురించి తెలుసుకుంటే..

హర్యానా(Haryana) రాష్ట్రం కర్నాల్(karnal) లో మహీంద్రా అనే వ్యక్తి ఉన్నాడు. ఇతడిని స్థానికులు కాకా జీ అని కూడా పిలుస్తారు. ఇతనికి రెండు చేతులు మోచేతుల వరకు లేవు. రెండు చేతులు అలా లేకపోతే చాలా మంది ఇక తమ వల్ల ఏమీ చేతకాదు అనుకుని నిస్తేజమైన జీవితం గడుపుతారు. కానీ మహీంద్ర మాత్రం అలా అనుకోలేదు.. తన సమస్యతో యుద్దానికే దిగాడు. ఇతరులను అందంగా కెమెరాలో బంధించే ఫోటోగ్రఫిని(Photography) తన వృత్తిగా ఎంచుకున్నాడు. తనకున్న కొద్దిపాటి చేతి కండరాలతోనే కెమెరాను ఒడిసిపట్టి అందమైన చిత్రాలను కస్టమర్ లకు అందిస్తున్నాడు. ఈ సూపర్ ట్యాలెంటెడ్ ఫోటోగ్రాఫర్(Photographer) లో ప్రతిభకు అక్కడి ప్రజలు ఫిదా అయ్యారు. పెళ్ళిళ్ళకు, శుభకార్యాలకు ఇతడినే ఫోటోగ్రాఫర్ గా పిలుస్తున్నారు.

మహీంద్ర కేవలం ఫోటోగ్రాఫర్ మాత్రమే కాదు, తన దగ్గరున్న కెమెరాలను అద్దెకు ఇస్తాడు. కెమెరాలు, వాటికి సంబంధించిన పరికరాలను సేల్ చేస్తాడు. తనకున్న అన్ని మార్గాలలో ఉపాధి అవకాశాలు సృష్టించుకున్నాడు. Harpal Singh Bhatia అనే ట్విట్టర్ యూజర్ మహీంద్ర ఒక ఫంక్షన్ లో ఇన్న వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ వీడియోలో మహీంద్ర కెమెరా పట్టుకుని కనిపిస్తాడు. తనకు ఫోన్ రావడంతో మెడలో అడ్డుగా ఉన్న కెమెరాను కాస్త పక్కకు జరిపి ఫ్యాంట్ జేబులో నుండి మొబైల్ బయటకు తీసి మాట్లాడటం వీడియోలో చూడచ్చు. జీవితంలో ఏమీ లేదని నిరాశా నిస్పృహాతో ఉన్న వాళ్ళు మహీంద్ర వీడియో చూసి తప్పకుండా జీవితం విలువ తెలుసుకుంటారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Read also: Viral Video: బంగారంలాంటి మనవరాలు.. బంగారాన్నే కాదు.. ఈ బామ్మ ప్రాణాలనూ కాపాడింది..!


Updated Date - 2023-03-10T19:10:33+05:30 IST