Viral Video: నీళ్ళలో చెత్త ఏరుకుంటోంటే కనిపించిన రంగురంగుల కాగితాలు.. ఏంటా అని చేతుల్లోకి తీసుకుని చూస్తే షాక్.. ఇంతకీ వాళ్లకు కనిపించిందేంటంటే..

ABN , First Publish Date - 2023-05-07T20:28:52+05:30 IST

కొందరు నీళ్లలో చెత్త ఏరుకుంటున్నారు. అప్పుడే వాళ్ళకు నీళ్లలో రంగురంగుల కాగితాలు కనబడ్డాయి. ఇవ్వేంటా అని చేతిలోకి తీసుకుని చూసి

Viral Video: నీళ్ళలో చెత్త ఏరుకుంటోంటే  కనిపించిన రంగురంగుల కాగితాలు.. ఏంటా అని చేతుల్లోకి తీసుకుని చూస్తే షాక్.. ఇంతకీ వాళ్లకు కనిపించిందేంటంటే..

ఒక్కోసారి సగటు మనిషికి షాకులిచ్చే సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. బ్రతుకు పోరాటంలో బురదలోనూ, మురికి నీళ్ళలోనూ తమ అదృష్టాన్ని వెతుక్కునేవారు ఉంటారు. కొందరు నీళ్లలో చెత్త ఏరుకుంటున్నారు. అప్పుడే వాళ్ళకు నీళ్లలో రంగురంగుల కాగితాలు కనబడ్డాయి. ఇవ్వేంటా అని చేతిలోకి తీసుకుని చూసి వాళ్ళు షాకయ్యారు. చుట్టు ప్రక్కల మొత్తం వెతగ్గా వారి కళ్లు బైర్లు కమ్మే దృశ్యం కనబడింది. మురికి నీళ్లలో చెత్త ఏరుకుంటున్న వాళ్ళకు కనిపించిందేంటో తెలిసి ఆ ఊరు మొత్తం అదిరిపడింది. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

బీహార్(Bihar) రాష్ట్రం రొహ్తాస్(Rohtas) జిల్లాలో ససారం మున్సిపల్ కార్పోరేషన్(Sasaram municipal corporation) ఉంది. దీని పరిధిలో ఉన్న చాలామంది ప్రజలు ఆ కాలువలో దిగి కొట్టుకువస్తున్న నోట్లకట్టలను ఏరుకుంటున్న వీడియో(currency notes collecting video) ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొందరు వ్యక్తులు ఆ కాలువలో దిగి చెత్త ఏరుకుంటున్నప్పుడు వారికి కరెన్సీ నోట్లు నీటిలో తేలుతూ కనిపించాయి. అవి చూసి చుట్టుప్రక్కల వెతగ్గా కురైచ్ వంతెన(kuraich bridge) కింద నీటిలో కరెన్సీ నోట్లు కట్టల కొద్దీ(bundles of currency notes) కనిపించాయి. ఈ విషయం కొన్ని సెకెన్ల వ్యవధిలో ఆ ప్రాంతమంతా వ్యాపించింది. పిల్లలు, పెద్దలు, వృద్దులు, మహిళలు ఇలా అందరూ ఆ కరెన్సీ కట్టలు సొంతం చేసుకోవడానికి ఎగబడ్డారు. చాలామంది కరెన్సీ కట్టలను తమతో ఇళ్లకు తీసుకెళ్లారు. కాలువలో కరెన్సీ కట్టలు కొట్టుకువచ్చాయని తెలుసుకున్న పోలీసు అధికారులు అక్కడికి చేరుకున్నారు. కరెన్సీ లభించిన ప్రాంతాల్లో వెతగ్గా అక్కడ వారికేమీ కనిపించలేదు. ప్రజలు డబ్బు తీసుకెళ్ళారని ధృవ పరచడానికి సాక్ష్యంగా సోషల్ మీడియాలో వీడియో హల్చల్ చేస్తుండటంతో దాని మీద దర్యాప్తు చేస్తున్నారు.

Tea: టీ తాగడానికి ముందు, తాగిన తరువాత నీళ్ళు తాగుతుంటారా? దానివల్ల ఏం జరుగుతుందో తెలిస్తే..


కాగా కాలువలో దొరికిన నోట్ల కట్టలు నిజమైనవా లేక నకిలీవా(real or fake) అనే విషయం తెలియం లేదు. నిజమైనవి అయితే కట్టలకొద్దీ కరెన్సీ నోట్లు అలా కాలువలోకి ఎందుకు విసిరుంటారో అర్థం కావడం లేదు. అన్నీ 500, 200 కరెన్సీ నోట్లు కావడంతో ఈ కరెన్సీ నోట్ల గురించి విషయం చాలా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం పోలీసులు ఈ కరెన్సీ గురించి దర్యాప్తు చేస్తున్నారు.

Divorce: వామ్మో.. ఇలాంటి కారణాలతో కూడా విడాకులిస్తారా..? మీ భార్యలకు ఎందుకు విడాకులిచ్చారని ఆ నలుగురు భర్తలను అడిగితే..!


Updated Date - 2023-05-07T20:28:52+05:30 IST