Viral Video: అమ్మ బాబోయ్.. దీనికి ఎంత ధైర్యం.. నడిరోడ్డుపై చిరుత పులి కాచుకుని కూర్చుందని చూసి కూడా..!

ABN , First Publish Date - 2023-07-17T13:26:38+05:30 IST

ఏ జంతువు అయినా పులి కంట పడితే ఇక ప్రాణాల మీద ఆశను వదిలేసుకుంటుంది. కానీ అడవిలో నడిదారిలో నింపాదిగా కాచుకుని కూర్చున్న చిరుతను చూసి ఏ మాత్రం భయపడకుండా ..

Viral Video: అమ్మ బాబోయ్.. దీనికి ఎంత ధైర్యం.. నడిరోడ్డుపై చిరుత పులి కాచుకుని కూర్చుందని చూసి కూడా..!

ఇంటికి యజమాని నాన్న అయినా పెత్తనమంతా అమ్మదే అన్నట్టు.. అడవికి రాజు సింహం అయినా అడవిలో దూకుడు మొత్తం పులి వెంటే ఉంటుంది. చిరుతపులి అయితే మరీ చురుకు. ఏ జంతువు అయినా దాని కంట పడితే ఇక ప్రాణాల మీద ఆశను వదిలేసుకుంటుంది. కానీ అడవిలో నడిదారిలో నింపాదిగా కాచుకుని కూర్చున్న చిరుతను చూసి ఏ మాత్రం భయపడకుండా అక్కడినుండి నింపాదిగా వెళ్లిపోయిందొక హైనా. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

అడవి జంతువుల(Wild animals) జీవితం చాలా విచిత్రమైనది. వాటి ప్రవర్తన ఒక్కోసారి ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. వీడియోలో అడవిలో నడిదారిలో ఓ చిరుతపులి ఠీవిగా కూర్చుని కనిపిస్తుంది(Leopard sitting on road). దానికి ఎదురుగా అదే దారిలో ఒక హైనా(Hyena) నడుచుకుంటూ రావడం కనిపిస్తుంది. పులి హైనావైపు తదేకంగా చూస్తుంది. హైనా మాత్రం ఎలాంటి బెదురు లేకుండా నింపాదిగా అలాగే నడుచుకుంటూ ముందుకు వస్తోంది. అప్పుడే చిరుత దారికి అడ్డంగా కూర్చున్నదల్లా పొజిషన్ మార్చుకుని హాయిగా పడుకుంటుంది. పులి ఏం చేస్తుందో ఏమో అనే భయం కూడా లేకుండా ఆ హైనా అలాగే ముందుకు నడిచింది. కానీ తీరా చిరుత ముందుకు వచ్చాక అది రూటు మార్చింది. ఆ హైనా చిరుత ముందు నుండి కాకుండా ఆ దారి నుండి తప్పుకుంది. అది పక్కన పొదలవైపు వైపు వెళ్ళి ఆ దారిలో కొద్ది దూరం నడిచి అది చిరుత వెనుక గా ఉన్న దారిలోకి వచ్చి అదే రహదారిలో కలిసిపోయింది. బాస్ ఎదురుగా ఉన్నప్పుడు ఎంత లౌక్యంగా తప్పించుకుంటారో అలా ఈ హైనా కుడా చిరుత నుండి తప్పించుకుంది.

30ఏళ్ళకే ముఖం మీద ముడతలా? ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు 50ఏళ్ళు దాటినా సంతూర్ మమ్మీలా కనబడతారు..


ఈ వీడియోను latestkruger అనే ఇన్స్టాగ్రామ్(Instagram) పేజీ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు హైనా చర్యకు ఆశ్చర్యపోతున్నారు. 'దీన్నే స్మార్ట్ మూవ్ అని అంటారు' అని ఒకరు కామెంట్ చేశారు. 'సమస్యలు వచ్చినప్పుడు భయపకుండా ప్రశాంతంగా ఆలోచిస్తే తెలివిగా బయటపడవచ్చు. ఆ హైనా అదే చేసింది.' అని మరికొందరు అంటున్నారు. 'ఆ చిరుతకు ఆకలిలేదు, అది కడుపునిండుగా తిని విశ్రాంతి తీసుకునే ఉద్దేశ్యంలో ఉంది. అందుకే అది హైనాను లైట్ తీసుకుంది' అని అసలు నిజం చెప్పారు మరికొందరు.

Scooty Video: ఇంటి బయటే స్కూటీని పార్క్ చేస్తున్నారా..? ఎందుకైనా మంచిది ఒక్కసారి ఈ వీడియోను చూడండి..!


Updated Date - 2023-07-17T13:26:38+05:30 IST